ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP Deputy CM Pawan Kalyan )ప్రస్తుతం అధికారిక కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.డిప్యూటీ సీఎం గా అధికార బాధ్యతలను చేపట్టిన పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తునన్నారు.
అలాగే కీలక విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు.ఇప్పటికే చాలా మంది ప్రజలు పవన్ కళ్యాణ్ ని కలిసి వారి సమస్యలను విన్నవించిన విషయం తెలిసిందే.
తాజాగా పవన్ సినీ నిర్మాతలతో సమావేశమై వారి సమస్యల గురించి చర్చించారు.అలాగే వైద్య, ఆరోగ్య శాఖపైన కూడా సమీక్ష నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) కూడా చాలా పరిపాలన బాధ్యతలలో పవన్ కళ్యాణ్ ని భాగస్వామ్యం చేశారు.అందుకే పవన్ కళ్యాణ్ తన శాఖలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.మంత్రిగా ఉద్యోగ నిర్వహణలో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే ఎన్నికలకి ముందు రాజకీయ క్షేత్రంలో సభల కోసం వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు.వారాహి అమ్మవారి పేరు మీదుగా ఆ యాత్రని మొదలు పెట్టారు.ఎన్నికలలో గెలవడంతో వారాహి అమ్మవారి మొక్కు చెల్లించుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారట.
అయితే ఇందుకోసం పవన్ 11 రోజుల వారాహి దీక్ష ( Varahi Diksha )చేయబోతున్నారట.ఈ నెల 26 నుంచి ఈ దీక్షని కొనసాగించనున్నారు.
ఈ దీక్షలో ఉన్నన్ని రోజులు కేవలం ఫలహారాలు మాత్రమే పవన్ కళ్యాణ్ ఆహారంగా తీసుకుంటారట.అయితే పవన్ కళ్యాణ్ 11 రోజులు వారాహి దీక్షని వైసీపీ 11 సీట్లతో ముడిపెడుతున్నారు.ఇప్పటికే వైసీపీకి 11 సీట్లు రావడంపై సోషల్ మీడియాలో మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష 11 రోజులు చేయడం వెనుక వైసీపీ సీట్లు గుర్తుచేయడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు.అయితే పవన్ మాత్రం ఇది కావాలని ఏమి చేయడం లేదు.ధీక్షలో భాగంగానే 11 రోజుల నెంబర్ ఫిక్స్ అయ్యింది