కర్మ అనేది ఉంది గుర్తుపెట్టుకోండి... ఇక ఓపిక లేదు ఫైర్ అయిన రేణు దేశాయ్!

రేణు దేశాయ్( Renu Desai ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండటమే కాకుండా తన గురించి నెగటివ్ కామెంట్లు చేసిన వారి పట్ల సంచలన వ్యాఖ్యలు చేస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.ఇక సోషల్ మీడియాలో ఈమె పవన్ కళ్యాణ్ అభిమానులతోనే వివాదానికి దిగుతున్నారు.

 Renu Desai Fire On Pawan Kalyan Fans And Switched Of Comment Box, Pawan Kalyan,-TeluguStop.com

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమానులు ఈమె గురించి చేసే కామెంట్లు తనని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ చేశారు.

అసలు సమస్య నువ్వు కాదని ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది.అవును, నువ్వు తప్పు చేయొచ్చు.మనమంతా మనుషులమే కనుక చేసిన తప్పుల నుంచి ఎదుగుతాం.అయితే ప్రేమతో మనం తీసుకునే నిర్ణయాలకు మన మనసుని గాయపరిచే అవకాశం మాత్రం ఈ ప్రపంచానికి ఇవ్వకూడదని ఉన్న ఒక కొటేషన్ ఈమె షేర్ చేశారు.

ఈ కొటేషన్ ని షేర్ చేసిన ఈమె మరొక పోస్ట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చారు.ఈరోజు నుంచి నేను నా ఇంస్టాగ్రామ్ కామెంట్ బాక్స్ ను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను.

నేను చేసే పోస్టులకు నెగిటివ్ కామెంట్లు చేసే ఎదవలకు రిప్లై ఇచ్చే అంత ఓపిక నాకు లేదు.ఇన్ని రోజులు నా బాధలు నాకు తోడుగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలు.అలానే నన్ను ద్వేషించేవారికి నేను ఒక్కటే చెబుతున్నా.కర్మ అనేది ఉంది.ఖచ్చితంగా మీ కోసం వస్తుంది.అంటూ ఈమె పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక రేణు దేశాయ్ గురించి మాత్రమే కాకుండా తన పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తున్నప్పటికీ పలువురు ఈమెను ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్లతో విసిగిస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube