ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) ప్రభాస్ అభిమానులకు ఎంతో నచ్చేసింది.ప్రభాస్,( Prabhas ) అమితాబ్ ఒకరిని మించి మరొకరు అద్భుతంగా నటించి సినిమా సక్సెస్ కు కారణమయ్యారు.
వాస్తవానికి అమితాబ్ తెలుగులో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు అంచనాలు అంచనాలను అందుకోలేదు.కల్కి 2898 ఏడీ సినిమా మాత్రం ఈ విషయంలో భిన్నం అని చెప్పవచ్చు.
మైథలాజికల్ అండ్ ఫ్యూచర్ విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా టార్గెట్ 395 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.యూఎస్ ప్రీమియర్ల విషయంలో కల్కి మూవీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమాకు ఓవర్సీస్ లో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ల నుంచి ఏకంగా 3.7 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి.గతంలో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లను సాధించలేదని తెలుస్తోంది.
మరోవైపు కల్కి సీక్వెల్ టైటిల్ కల్కి 3102 బీసీ( Kalki 3102 BC ) అని సమాచారం అందుతోంది.శ్రీ కృష్ణుడు మానవ శరీరాన్ని వీడిన సంవత్సరం అదే కావడంతో మేకర్స్ అదే టైటిల్ ను ఫిక్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.నాగ్ అశ్విన్ కు( Nag Ashwin ) ఒక అభిమాని ఈ టైటిల్ ను సూచించగా నాగ్ అశ్విన్ ఏం చేస్తారో చుడాల్సి ఉంది.
నాగ్ అశ్విన్ ఈ సినిమాతో దర్శకునిగా ఎన్నో మెట్లు పైకి ఎక్కారు.
కొంతమంది ఈ సినిమా చూసి నాగ్ అశ్విన్ కు ఇంత టాలెంట్ ఉందని అస్సలు ఊహించలేదని మరి కొందరు చెబుతున్నారు. నాగ్ అశ్విన్ సొంత బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.కల్కి 2898 ఏడీ సినిమ ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోనుందో చూడాల్సి ఉంది.
కల్కి సీక్వెల్ షూట్ త్వరలో మొదలుకానుందని సమాచారం అందుతోంది.