విమర్శించిన వాళ్లు ఇకనైనా నోరు మూస్తారా.. నాగ్ మనస్సు బంగారం అంటూ?

టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ఇటీవల తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.ఈయన ముంబై ఎయిర్ పోర్ట్ ( Mumbai Airport ) నుంచి వస్తున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున తనతో సెల్ఫీలు తీసుకోవడం కోసం వచ్చారు.

 Nagarjuna Hugged Handicapped Fan Who Pushed By His Bodyguard At Mumbai Airport D-TeluguStop.com

అయితే ఎయిర్ పోర్ట్( Airport ) లో పనిచేస్తున్న ఓ సిబ్బంది నాగార్జునతో సెల్ఫీ తీసుకోవడానికి ముందుకు రాగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆయనని తోయడంతో ఒకసారిగా కింద పడబోయారు.ఇలా కింద పడుతున్న ఆ వ్యక్తిని తోటి సిబ్బంది పట్టుకున్నారు.

అయితే నాగార్జునకు తెలియకుండా ఈ విషయం జరగడంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నాగార్జున పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.అయితే ఈ విషయం నాగార్జున దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ ఘటనపై స్పందించి సదరు అభిమానికి( Nagarjuna Fan ) క్షమాపణలు చెప్పడమే కాకుండా ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఈ విషయంలో తన సెక్యూరిటీ( Security ) చేసినది పూర్తిగా తప్పని క్షమాపణలు చెప్పారు.

ఇలా తన గురించి ఈ స్థాయిలో విమర్శలు రావడంతో తాజాగా అదే ఎయిర్ పోర్ట్ కి వెళ్లి నాగార్జున తన కారణంగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ అభిమానిని దగ్గరికి తీసుకొని తనని పరామర్శించడమే కాకుండా ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోలపై నాగార్జున అభిమానులు స్పందిస్తూ విమర్శించిన వాళ్ళు ఇప్పటికైనా నోర్లు ముస్తారా నాగార్జున గారికి తెలియకుండా ఈ ఘటన జరిగింది.

కానీ ఆయన మనసు బంగారం అంటూ అభిమానులు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube