వైరల్ వీడియో: అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు చూశారా..?అదిరిపోయిందిగా..

త్వరలో జరగబోయేఅనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల( Annath abani, Radika marchent, ) వివాహ వేడుకకు సంబంధించి పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరగబోతున్నాయి.ప్రస్తుతం ఆ పెళ్ళికి సంబంధించిన పెళ్లి పత్రిక అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

 Viral Video: Have You Seen Anant Ambani's Wedding Card , Annath Abani, Radika Ma-TeluguStop.com

ఇక ఈ వెడ్డింగ్ కార్డ్ ఒక్కదాని ధరతో పేదవారు మూడు పెళ్లిళ్లను జరిపించుకోవచ్చు.అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహం కోసం అంబానీ కుటుంబ సభ్యులు పంచుతున్న వెడ్డింగ్ కార్డ్ ధర అక్షరాల రూ.6,50,000.అవును మీరు విన్నది నిజమే.

అంతలా ఈ కార్డులో ఏముందని అనుకుంటున్నారా.? ఈ వెడ్డింగ్ కార్డులో మూడు కేజీల వెండి దేవాలయం( Silver Temple ) ఏర్పాటు చేసి 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డును అంబానీ కుటుంబ సభ్యులు పంచుతున్నారు.

ఇదివరకు కూడా అంబానీ కూతురు ఈషా అంబానీ( Isha Ambani ) పెళ్లికి కూడా ఒక్కొక్క పెళ్లి కార్డు మూడు లక్షల విలువచేసే వెడ్డింగ్ కార్డును పంచి రికార్డు సృష్టించారు.ఇప్పుడు ఆ కార్డుకు రెట్టింపు ధరగా చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కార్డును పంచుతున్నారు అంబానీ కుటుంబ సభ్యులు.ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పటికే కొంతమంది ప్రముఖులకు అందజేయబడ్డాయి.

ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోని గమనించినట్లయితే అందులో వెండితో చేసిన చిన్న గుడి, అందులో ఒక బంగారు విగ్రహం కనబడుతుంది.పెళ్లి కార్డుకు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాగ్రౌండ్ లో మొదటగా విష్ణు సహస్రనామం వినిపిస్తుంది.అలాగే ఆలయంలో చుట్టూ వివిధ రకాల దేవుళ్ళ విగ్రహాలు బంగారంతో చేసినవి కనపడుతుంది.అలాగే వెడ్డింగ్ కార్డులో లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణు, వినాయకుడు, రాధాకృష్ణ, దుర్గాదేవి వంటి హిందూ దేవుళ్ళ చిత్రాలు కనపడతాయి.

ఇక అలాగే మరో బాక్స్ లో వెండి పెట్టెలో ఓం అని ఎంబ్రాయిడింగ్ చేసిన శాలువా.అలాగే బంగారంతో చేసిన దేవుడి విగ్రహాలు కూడా కనబడతాయి.ఇక ఈ వెండి బంగారం కలగలుపు చేసిన వెడ్డింగ్ కార్డును చూసిన వారంతా అపరకుబేరుడు ఈ మాత్రం ఖర్చు పెడతాడు.దాంట్లో ఎగ్జిట్మెంట్ ఏముందంటూ కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా పెళ్లి కార్డుకే ఈ రేంజ్ లో ఖర్చుచేస్తే.మరి పెళ్లి ఖర్చు ఊహకు అంతుపట్టదేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube