రామోజీ గ్రూప్స్ అధినేత, రామోజీరావు( Ramoji Rao ) ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈయన మరణించడంతో చిత్ర పరిశ్రమ ఎంతో దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
రామోజీరావు మరణ వార్త తెలిసి ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పించారు.ఇకపోతే రామోజీరావు మరణం తర్వాత ఏపీ ప్రభుత్వం ఆయన సంస్కరణ సభలను విజయవాడలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి ( MM Keeravani ) మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.నేను గతంలో ఎన్నో సభలలో బ్రతికితే రామోజీరావు గారి లాగా బ్రతకాలి అని చెప్పాను కానీ ఇప్పుడు మరణించిన కూడా ఆయనలాగే మరణించాలని కోరుకుంటున్నట్లు కీరవాణి తెలిపారు.
ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని ఉత్తరాయణం వచ్చేవరకు ఆపుకొని తానే మరణించాడు.
అదే విధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ ని కబంధ హస్తాల నుంచి బయటపడటం ఆయన కళ్లారా చూసి అప్పుడు ఆయన నిష్క్రమించారంటూ పరోక్షంగా వైయస్ జగన్( YS Jagan ) పరిపాలనపై ఈయన విమర్శలు చేశారు.ఇక రామోజీరావు గారు దేవుడిని నమ్మరు కానీ ఆయన ఫోటో మా దేవుడి గదిలో ఉంటుందని కీరవాణి తెలిపారు.ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపిన ఆయన ఎప్పటికీ మాకు స్ఫూర్తిగా నిలుస్తారని కీరవాణి తెలిపారు.
ఈ విధంగా కీరవాణి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.