మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలలో క్యాల్షియం( Calcium ) కూడా ఒకటి.ఈ లోపం వస్తే ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తాయి.
అయితే ఆహారం ద్వారా కాల్షియాన్ని తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.అయితే ఆహారం ద్వారా తగిన మొత్తంలో కాల్షియం అందకపోతే వైద్యులు క్యాల్షియం సప్లిమెంట్లు కూడా సూచిస్తారు.
అయితే ఎంతో మందిలో క్యాల్షియం లోపం కనిపిస్తూ ఉంటుంది.మరి ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళల్లో క్యాల్షియం లోపం వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
అయితే క్యాల్షియం లోపిస్తే ఎముకలు బలహీన పడిపోతాయి.ఇక చిన్న చిన్న వస్తువులను కూడా ఎత్తలేకపోతారు.
అంతేకాకుండా దంతాల సమస్యలు( Dental problems ) కూడా వస్తాయి.అలాగే గోర్లు విరిగిపోవడం( Nail breakage ) లాంటివి కూడా జరుగుతాయి.

ఇక తల తిరుగుతున్నట్టు కూడా కనిపిస్తుంది.వ్రేళ్ళు, పాదాలు, కాళ్లలో ఎప్పుడూ తిమ్మిర్లు( Cramps ) కనిపిస్తాయి.శరీరం మొత్తం బద్ధకంగా అనిపిస్తుంది.ఇక తీవ్రమైన అలసటగా కూడా అనిపిస్తుంది.గోళ్ళు పేలుసుగా మారిపోతాయి.ఇక సరైన నిర్ణయాలు తీసుకోలేక తికమక పడుతూ ఉంటారు.
ఆకలి కూడా వేయదు.ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఇలా ఉంటే కచ్చితంగా కాల్షియం లోపం ఉంది అని అర్థం చేసుకోవచ్చు.అలాంటి సమయంలో వెంటనే వైద్యులను కలిసి కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది.
ఇలా ఉంటే కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను రోజు తింటూ ఉండాలి.ఇక చాలామందికి పాలు తాగడం కూడా ఇష్టం ఉండదు.

కానీ పాలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.అందుకే ప్రతిరోజు గ్లాసుడు పాలు( Milk ) తాగితే క్యాల్షియం అందుతుంది.ఇక ఆహారంలో కచ్చితంగా పెరుగు ఉండేలా కూడా చూసుకోవాలి.పాలు పెరుగులో క్యాల్షియం ఉంటుంది.ఇక తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండింటిలో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది.కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు వేసుకొని తినాలి.
అలాగే ఖర్జూరాలలో కూడా కాల్షియం ఐరన్ రెండు ఉంటాయి.కాబట్టి రోజు మూడు ఖర్జూరాలు తినాలి.
ఈ విధంగా ఆహారం తీసుకోవడం వల్ల క్యాల్షియం పెంచుకోవాలి.