ప్రకాష్ రాజ్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.దేశంలో గొప్ప నటుల జాబితా తీస్తే అందులో ప్రకాష్ పేరు ఉండక తప్పదు.
ఏ భాషలో చేసిన గాని ఆ భాష వాడే, అనిపించేంతగా నటించి మెప్పిస్తాడు.అయితే ప్రకాష్ రాజ్ సినీ ప్రయాణం గురించి అందరికీ తెలుసు కానీ ప్రకాష్ రాజ్ గారు సినిమాల్లోకి రాకముందు ఏం చేశారో, ఎన్ని కష్టాలు పడ్డారో అనేది చాలా మందికి తెలియదు.
ఆయన ఎన్నోసార్లు ఆయన ధైర్యంగా నేను కోపిష్టిని, పొగరుబోతుని, ఇంకా నాలో దుర్లక్షణాలు చాలా ఉన్నాయి.ఎన్నో తప్పులు చేశాను.
కానీ చేసిన తప్పులు తెలియకుండా జాగ్రత్త పడ్డాను.తప్పుచేయకుండా ఉన్న మనిషి అనేవాడే ఉండడు.
తప్పులు చేయట్లేదు అని చెప్పుకుంటున్నాడంటే అదే పెద్ద తప్పు అని నిర్మొహమాటంగా చెప్పే వాడే ప్రకాష్ రాజ్.నాకు ఇలాంటి మనస్తత్వం ఇచ్చి నాతో ఇన్ని తప్పులు చేపించి, ఆ తప్పుల ద్వారా నేర్చుకునే మనస్తత్వాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి రుణపడి ఉంటాను అంటారు ప్రకాష్ రాజ్.
ప్రకాష్ రాజ్ తల్లిదండ్రులది ప్రేమ వివాహం.తల్లి క్రిస్టియన్ మతానికి చెందిన ఆవిడ.ఆవిడ ఒక అనాధ.తండ్రిది హుబ్లీ.ఇంట్లో వ్యవసాయం చేయమని అన్నారని బయపడి, పారిపోయి బెంగుళూరు వచ్చిన వ్యక్తి.తల్లి అనాదశరణాలయం నుంచి వచ్చి నర్సుగా చేస్తున్నప్పుడు ఆరోగ్యం బాగోలేక హాస్పటల్ కు వచ్చిన తన తండ్రితో ప్రేమలో పడ్డారు.
తరువాత ఇరువురు వివాహం చేసుకున్నారు.ప్రకాష్ రాజ్ మొదటి సంతానం.
తనకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు.తన కుటుంబానికి, సినీ పరిశ్రమకు ఎటువంటి సంబంధాలు లేవు.
అలాగే ప్రకాష్ రాజ్ కు సినిమాలు చూసే అలవాటు కూడా లేదు.చిన్నతనంలో స్టేజి ఎక్కి డిబేట్ కంపిటేషన్ లో ప్రైజ్ గెలుచుకోవడం, ఆనందంతో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకోవడం ప్రకాష్ రాజ్ కి బాగా నచ్చింది.
ఇక అప్పట్నుంచి జనాల్ని మెప్పించడానికి తపన పడేవాడు.ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే.
ఆర్థికపరంగా దిగువ మధ్యతరగతి కుటుంబమే.కాలేజీకి కూడా పంపించడానికి డబ్బులు లేని స్థితి.
అయినా ఇవేమీ పట్టేవి కాదు ప్రకాష్ రాజు కి ఎప్పుడూ అల్లరి చిల్లరిగా తిరిగే వాడు.ఒక రోజు క్లాస్ రూమ్ లో అల్లరి చిల్లరిగా చేస్తున్న పనులకు విసిగిపోయిన లెక్చరర్ ప్రకాష్ రాజ్ మీద కోపంతో.
ఒరేయ్ నీకు చదువుకోవాలని లేకపోతే బయటకు పో అంతేకాని చదువుకునే వాళ్లని పాడుచేయకు.చదువుకోవడం ఇష్టం లేకపోతే ఏదన్నా పని చేసుకోవచ్చు కదా ఎందుకు ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నావ్ అని క్లాస్ రూమ్ నుంచి గెంటేసాడు లెక్చరర్.
అంతే అవమానంతో, కోపంతో రెచ్చిపోయి గమ్యం లేకుండా 5 కిలోమీటర్లు నడిచేసాడు.
అప్పటికి అలుపు వచ్చి ఒక పక్కకు ఆగితే అక్కడ నాటక బృందం కనిపించింది అంట.అక్కడ వాళ్ళతో ప్రకాష్ రాజ్ కు పరిచయం ఏర్పడింది.అలాగే వాళ్ళకి ఒక వ్యక్తి కావాలి.
దీనితో వాళ్ళతో చేతులు కలిపి ఎన్నో వీధి నాటకాలు వేసి, వచ్చిన డబ్బుతో కుటుంబ ఆలనా పాలనా చూసుకున్నాడు కొన్నాళ్లపాటు.అయితే నాటకరంగం అంతరించిపోతున్న రోజులవి.గొప్ప గొప్ప కళాకారులూ కూడా నాటక రంగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లిపోతున్న రోజులవి.కొన్నాళ్ళు గడిచాక ప్రకాష్ రాజ్ కూడా నాటకాలు వదిలేసి దూరదర్శన్ లో చిన్న చిన్న క్యారెక్టర్ లో నటించాడు.
అలాగే ఆర్ట్ ఫిల్మ్ లో కూడా చేశాడు.అక్కడ పరిచయమైన నటి గీత ప్రకాష్ రాజ్ జీవితాన్ని మార్చేస్తుంది.
మీకు ఇంత టాలెంట్ ఉంది.ఒకసారి బాలచందర్ గారిని కలవక పోయారా అని సలహా ఇచ్చింది.
అలాగే దగ్గరుండి బాలచందర్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించారు గీత.అయితే బాలచందర్ గారు ప్రకాష్ రాజ్ తో కేవలం పది నిమిషాల పాటు మాట్లాడదామని కూర్చున్న ఆయన ప్రకాష్ రాజ్ తోటి రెండున్నర గంటల సేపు మాట్లాడాడు.
ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రకాష్ రాజ్ తో ఇలా అన్నారు అంట.నీ కళ్ళల్లో ఏదో ఒక తెలియని షైన్ ఉంది.మీకు ఎంతో మంచి టాలెంట్ ఉంది.మీకు సినిమాలో నటించే అవకాశాన్ని నేను ఇస్తానని మాట ఇచ్చారు.అలా తమిళ బాష రాని ప్రకాష్ రాజ్ ని మొదట “డ్యూయెట్” సినిమాలో తీసుకున్నారు.ఐతే సినిమా ట్రయిల్ చూసి బయటకు వచ్చిన బాలచందర్.
రేయ్ ఏంటి సినిమా అంతా నువ్వేన ఎదో ఒక సీన్ తీద్దామనుకుంటే మొత్తం 15 సీన్లు తీయించావ్ అని అన్నపుడు ప్రకాష్ రాజ్ ఆనందానికి అవధులు లేవట.ఫైనల్ కాపీ అప్పుడు బాలచందర్ గారు ప్రకాష్ గారి దగ్గరికి వచ్చి సారీ చెప్పాడంట.
కొన్ని కారణాల వల్ల నీవు నటించిన కొన్ని సీన్లను తీసేయాల్సి వచ్చింది అని చెప్పారు అంట.మళ్ళీ మనిద్దరం కలిసి ఒక సినిమా చేద్దామని మాట ఇచ్చారట.ఆ తర్వాత ప్రకాష్ రాజు కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు.అలాగే బాలచందర్ గారు ప్రకాష్ రాజ్ వెన్నంటే ఉండి ఆయనకు అడపాదడపా తమిళంలో కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు.
అలా ప్రకాష్ రాజు తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు.అయితే ప్రకాష్ రాజ్ ది తెలుగులో నటించిన మొట్ట మొదటి సినిమా ఏంటంటే జగపతి బాబు, గౌతమి కలిసి నటించిన సంకల్పం సినిమా. ఏఎం రత్నం ఏరికోరి ప్రకాష్ రాజు గారి టాలెంటు తెలిసి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కి అవకాశం ఇచ్చారు.అయితే ఒక నటుడు అంటే ఎలా ఉండాలి ఎంత ఫైర్ ఉండాలి, ఎంత తపన ఉండాలి.
ఏదైనా కానీ పట్టుదలతో సాధించి తీరాలి అన్న దానికి ప్రకాష్ గారు ఒక ఉదాహరణ.ఒక సంఘటన ప్రకాష్ రాజు గారి జీవితాన్నే మార్చేసింది అది ఏంటంటే సంకల్పం సినిమాలో ప్రకాష్ రాజ్ చేసిన రోల్ కి ఇంకెవరో డబ్బింగ్ చెబుతున్నారు.
ప్రకాష్ రాజు గారికి అప్పటికి తెలుగు ఒక్క ముక్క కూడా రాదు.అసలు ఎక్స్ప్రెషన్స్, మోడ్యులేషన్స్ ప్రకాష్ రాజ్ చెప్పినట్లు చెప్పలేకపోతున్నారు ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్.డబ్బింగ్ థియేటర్ లో ఉన్న ప్రకాష్ రాజ్ ఇది ఇలా కాదు.అలా అని, ఇది ఇంకోసారి ఇలా చేద్దాం అని తానే చొరవ తీసుకుని చెప్పడంతో ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ కు కోపం వచ్చి ప్రకాష్ రాజ్ ఇక్కడ ఉంటే నేను డబ్బింగ్ చెప్పను అని అన్నాడట.
అంతే మొహమాటం లేకుండా ప్రకాష్ రాజ్ ను బయటకు గెంటించేసాడట ఆరోజున.అలా బయటకు గెంటిచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ ఎంతో అవమానంగా ఫీల్ అయ్యి ఆరోజు అక్కడే ఎక్కిళ్ళు పెట్టి మరి ఏడిచేసాడంట.
ఆ ఏడుపులో నుంచే ఎలాగయినా తెలుగు నేర్చుకోవాలని తపన, పట్టుదల పెరిగాయట.సీతారామశాస్త్రి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి ఇలాంటి ప్రముఖుల అందరి సహకారంతో తెలుగు నేర్చుకుని, తెలుగు సాహిత్యం చదివే స్థాయికి ఎదిగాడు.
ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు ప్రకాష్ రాజు.తనలోని ఆ పట్టుదల వల్లనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు ప్రకాష్ రాజ్.