ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్, నీరసం, అలసట, అధిక దాహం ఇలా ఎన్నో సమస్యలు వేధిస్తూ ఉంటాయి.
అందుకే సమ్మర్ అంటేనే భయపడిపోతుంటారు.అయితే వేసవిలో విరి విరిగా లభ్యమయ్యే మామిడి పండ్లను పుదీనాతో కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే సమ్మర్ లో టెన్షన్‌నే పడక్కర్లేదు.
మరి లేటెందుకు మ్యాంగో, పుదీనాను కలిపి ఎలా తీసుకోవాలి.? అసలు ఆ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటీ.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందు దోరగా పండిన ఒక మామిడి పండును తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే అర గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుని నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు, పుదీనా ఆకులు, ఐదారు గింజ తొలగించిన ఖర్జూరాలు, రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, చిటికెడు నల్ల ఉప్పు, చిటికెడు వేయించిన జీలకర్ర పొడి, అర లీటర్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మ్యాంగో, మింట్(పుదీనా) జ్యూస్ సిద్ధం అవుతుంది.

ఈ మ్యాంగో, మింట్ జ్యూస్‌ను వారంలో నాలుగు సార్లు గనుక తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.వడ దెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది.అధిక వేడి తొలగిపోయి శరీరం చల్లగా మారుతుంది.నీరసం, అలసట, తలనొప్పి వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.రక్తపోటు అదుపులో ఉంటుంది.మరియు జీర్ణ వ్యవస్థ సైతం చురుగ్గా మారుతుంది.
కాబట్టి, ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ మ్యాంగో మింట్ జ్యూస్‌ను తీసుకోవడానికి ప్రయత్నించండి.