ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న రాజమౌళి( Rajamouli ) సైతం ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు.అయితే కెరియర్ మొదట్లో ఆయన చాలామంది హీరోలతో మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో పలు రకాల కథలను కూడా పరిశీలించాడు.
కానీ ఎట్టకేలకు ఆయన మాస్ సినిమాలకు మాత్రమే స్టిక్ అయిపోయాడు.ఎందుకంటే మాస్ సినిమాలు అయితేనే అతనికి విపరీతమైన ఆదరణ వస్తుంది.
అలాగే కలెక్షన్స్ పరంగా కూడా భారీగా రేంజ్ లో వసూళ్లు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో ఆయన అలాంటి సినిమాలను చేయాలని ఫిక్స్ అయ్యారట.
ఇక దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం మహేష్ బాబుతో( Mahesh Babu ) పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశ్యంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే మహేష్ బాబు సినిమాని దాదాపు 20 దేశాల్లో షూటింగ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
డిఫరెంట్ లొకేషన్స్ లో సినిమా అని విజువల్ వండర్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారట.
ఇక దానికోసమే రీసెంట్ గా వరల్డ్ టూర్ మొత్తం వేసినట్టుగా తెలుస్తుంది.మొన్నటికి మొన్న కెన్యాలో లొకేషన్స్( Locations in Kenya ) తన ఇన్స్టా లో ఒక ఫోటోను కూడా అప్లోడ్ చేశాడు.రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ఒక హై పొజిషన్ల లో ఉండడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతూ ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని సైతం పాన్ వరల్డ్ హీరోగా మారుస్తున్న ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది…చూడాలి మరి ఆయన్ చేసే సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…
.