అరటిపండును ఎక్కువగా తింటున్నారా....అయితే ఇది మీ కోసమే

అరటిపండును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.అన్ని రకాల పండ్లలో అరటిపండు కాస్త ధర తక్కువగా ఉండుట వలన చాలా మంది అరటిపండు తినటానికి ఆసక్తి చూపుతారు.

 Banana, Side Effects Of Eating More Bananas, Bananas For Weight Gain,sleeping, D-TeluguStop.com

అరటి పండు తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మనకు తెలిసిన విషయమే.అయితే అరటిపండును ఎక్కువగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అరటిపండును ఎక్కువగా తినటం వలన మన శరీరం పోషకాలను సరిగా గ్రహించలేదు.మన శరీరంలో అన్ని జీవక్రియలు సరిగా జరగాలంటే పోషకాలు అవసరం.అందువల్ల అరటిపండును మితంగా తినాలి.

అరటిపండులో పిండి పదార్ధాలు అధికంగా ఉండుట వలన ఎక్కువగా తింటే మలబద్దకం సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అరటిపండులోని పిండిపదార్ధాలు తొందరగా జీర్ణం కాక ఆ ప్రభావం జీర్ణాశయం మీద పడుతుంది.అంతేకాక అరటిపండులో ఉండే పెక్టిన్ అనబడే పీచు పదార్థం ప్రేగుల్లోని నీటిని ఎక్కువగా శోషించుకుంటుంది.అందువల్ల అరటిపండును ఎక్కువగా తింటే పేగుల్లో ఆహారం, మలం కదలికలు సరిగా లేక మలబద్ధకం సమస్య వస్తుంది.

Telugu Banana, Bananas, Effects Bananas-Telugu Health - తెలుగు హ

అరటిపండును ఎక్కువగా తింటే అరటిపండులో ఉండే పిండి పదార్ధాలు బరువు పెరిగేలా చేస్తాయి.అందువల్ల బరువు తగ్గాలని అనుకొనే వారు రోజుకి రెండు అరటిపండ్లను మించి తీసుకోకూడదు.

అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది.

ఈ క్రమంలో అరటి పండ్లను ఎక్కువగా తింటే నిద్ర బాగా వస్తుంది.మెదడు చురుగ్గా పనిచేయలేదు.

బద్దకంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube