సీనియర్ నటిని టెన్షన్ పెడుతున్న సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ టెన్షన్

సోషల్ మీడియాలో వినియోగం ఎక్కువ అయ్యాక చాలా మంది దానిని దుర్వినియోగం చేస్తున్నారు.ఒక మంచి ప్రయోజనం కోసం చేస్తే దానిని తప్పుడు ప్రయోజనాలకి ఉపయోగించుకుంటున్నారు.

 Senior Actress Ambika Warns, Fake Facebook Account, Kollywood, Tollywood, Social-TeluguStop.com

మంచి ఉన్న చోటుకి చెడు కూడా చొచ్చుకొని వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు.ఇప్పుడు సోషల్ మీడియా వ్యవహారం చూస్తూ ఉంటే అలానే అనిపిస్తుంది.

సెలబ్రిటీలు తమ అభిమానులతో మంచి సంబంధాలు కలిగి ఉండటానికి సోషల్ మీడియాని వాడుకుంటున్నారు.రెగ్యులర్ గా లైవ్ వీడియో ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్నారు.

అయితే పాతతరం సెలబ్రిటీలలో చాలా మందికి సోషల్ మీడియా ఉపయోగించడం తెలియదు.అలాగే తెలిసిన కూడా దాని మీద అంతగా ఆసక్తి చూపించారు.

అయితే కొంత మంది తప్పుడు ప్రయోజనాల కోసం ప్రస్తుతం ఉన్న సెలబ్రిటీలకి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫాలోవర్స్ ని పెంచుకొని వాటి ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు.

అయితే ఇలాంటి వాటి విషయంలో నేటితరం సెలబ్రిటీలు అందరూ జాగ్రత్త పడతారు.

అయితే నిన్నటి తరం వారు మాత్రం అంత వేగంగా గుర్తించలేరు.ఆ మధ్య రావు రమేష్ పేరు మీద ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వైసీపీ మీద విమర్శలు చేశారు.

ఈ విషయం అతని దృష్టికి వెళ్ళగానే దానికి రావు రమేష్ ఖండించి, తనకి ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవని క్లారిటీ ఇచ్చేశారు.ఇప్పుడు అలాంటి తలనొప్పి పాతతరం హీరోయిన్ అంబికకి కూడా ఎదురయ్యింది.

ఆమె పేరు మీద నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు గుర్తించింది.తన సన్నిహితులు ఈ విషయం చెప్పేంత వరకు తనకి తెలియలేదని చెప్పింది.

తనకి ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవని, ఎవరైనా తన పేరుతో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేస్తే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube