వైరల్ వీడియో: చీర కట్టి దివ్యంగుల నిరసన.. ఎందుకంటే?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఏర్పడినప్పుడు నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం నడుస్తున్న సంగతి తెలిసిందే.హైదరాబాద్ మహానగరంలో, అలాగే రాష్ట్రం మొత్తం మహిళలకు ఉచితంగానే ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

 Because Of The Viral Video Sari Tying The Protest Of The Disabled, Viral Video,-TeluguStop.com

కర్ణాటక ప్రభుత్వం లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.అదే ఫార్ములాను రేవంత్ రెడ్డి సర్కార్ ( Revanth Reddy Sarkar )కూడా తెలంగాణలోనూ అమలు చేసింది.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి మంచి స్పందనని లభించింది.అయితే ఈ స్కీం వల్ల అనేక మంది ఉపాధి కోల్పోయారంటూ అనేక వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి.

ఒక్కొక్కసారి ఉచిత ప్రయాణంలో మహిళలు అధిక సంఖ్యలో ఎక్కి వారు కొట్టుకున్న సంఘటనలు కూడా చాలానే వైరల్ అయ్యాయి.ఇదిలా ఉండగా.

తాజాగా ఉచిత బస్సు ప్రయాణం సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వైరల్ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆర్టీసీ బస్సుల్లో( RTC buses ) మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలే కూర్చుని దౌర్జన్యం చేస్తున్నారని కొందరు వికలాంగులు వినూత్న రీతిలో తమ నిరసనలు తెలిపారు.ఈ నేపథ్యంలో కొందరు వికలాంగులు పట్టణంలోని బస్టాండ్ లో ఉన్న బస్సులలో చీర కట్టుకొని కొందరు మగవారు వికలాంగులు ఎక్కి కాస్త వెరైటీగా నిరసనను తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఓ వికలాంగుడు మాట్లాడుతూ.తెలంగాణ సర్కార్ ఉచిత మహిళ ప్రయాణం స్కీం చేపట్టినప్పటి నుంచి వికలాంగులకు ఏర్పాటు చేసిన సీట్లలో కూడా వారు కూర్చుని వికలాంగులకు స్థానాలు ఇవ్వడం లేదంటూ తమ బాధను తెలియజేశారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకొని వికలాంగులకు మూడు సీట్లను కేటాయించాలని, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.వికలాంగులకు ఇలాంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube