ప్రస్తుతం అక్కినేని ఇంట వరుసగా శుభకార్యాలు జరుగుతున్నాయి.మొన్నటికి మొన్న అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్(Akkineni Naga Chaitanya,Shobhita Dhulipala) వేడుక జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఈ జంట డిసెంబర్లో ఒకటి కాబోతున్నారు అన్న సంతోషంలో ఉన్న అక్కినేని అభిమానులకు ఊహించని షాక్ ఇస్తూ నాగార్జున(Nagarjuna) తన కొడుకు అఖిల్(Akhil) కి నిశ్చితార్థ వేడుకలు జరిపించేశారు.దాంతో నాగ చైతన్య పెళ్లి పనులు ఒక వైపు, అఖిల్ ఎంగేజ్మెంట్ సందడి ఒక వైపుతో అక్కినేని ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి.
అఖిల్ జైనబ్(Akhil, Zainab) ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున షేర్ చేసి గుడ్ న్యూస్ తెలిపారు.అసలు అఖిల్ పెళ్లి గురించి ఒక్క లీక్ కూడా బయటకు రాలేదు.నాగార్జున షేర్ చేసే వరకు అఖిల్, జైనబ్ లవ్ స్టోరీని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.కానీ అఖిల్, జైనబ్ పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్ కాలేదు.డిసెంబర్ లో నాగ చైతన్య, శోభిత పెళ్లి కానుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో అఖిల్ పెళ్లి పెట్టుకునే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా అమల అక్కినేని అఖిల్ జైనబ్(amala akkineni ,akhil, zainab ) ఎంగేజ్మెంట్ గురించి ఒక పోస్ట్ చేసింది.తన కొడుకు అఖిల్ నిశ్చితార్థం కాబట్టి అమ్మలా అఖిల్ ఫుల్ ఖుషీలో ఉంటుంది.
అఖిల్, జైనబ్ గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ వేసింది.అయితే నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ గురించి మాత్రం అమల ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ కనిపించడం లేదు.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమల ఇలా చైతూ, శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేయకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.అఖిల్, జైనబ్ ఎంగేజ్మెంట్ మీద అమల పోస్ట్ వేసింది.
కానీ కామెంట్ సెక్షన్ ని క్లోజ్ చేసింది.మళ్లీ నెగెటివ్ కామెంట్లు చూడాల్సి వస్తుందనే ముందు జాగ్రత్తతో ఇలా కామెంట్ సెక్షన్‌ను క్లోజ్ చేసినట్టుగా కనిపిస్తోంది.
అమల ఇలా తన సొంత కొడుక్కి, సవతి కొడుక్కి తేడాలు చూపిస్తోందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.