వేసవి కాలం కదా అని కీరదోసకాయను అధికంగా తింటున్నారా..? అయితే జాగ్రత్త..!

వేసవికాలంలో( Summer ) అధిక వేడి వలన చాలామంది ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటారు.ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వలన చాలామంది వేడికి బాధపడుతూ ఉంటారు.

 Side Effects Of Excessive Eating Of Cucumber In Summer Details, Side Effects ,ex-TeluguStop.com

అయితే ఈ వేడి వలన ప్రతి ఒక్కరు కూడా చల్లదనాన్ని కోరుకుంటారు.అందుకే వేసవికాలం వచ్చిందంటే ఎక్కువగా నీరు, కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు.

అయితే వేసవికాలంలో వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు, పండ్లు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయల్లో కీర దోసకాయ( Cucumber ) ఉత్తమమైనది.

కీర దోసకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇది కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సీజన్లో కూడా లభిస్తుంది.

మరీ ముఖ్యంగా వేసవికాలంలో ఇది ఎక్కువగా లభిస్తుంది.అయితే కీరదోస తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.దీనిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, అప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అందుకే దీన్ని తీసుకోవడం వలన దాహం తీరడంతో పాటు శరీరం హైడ్రేట్ గా( Hydrate ) ఉంటుంది.

దీనివల్ల వడదెబ్బ నుండి కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు.కీరదోసకాయ తినడం వలన కండరాలకు, నరాలకు శక్తి లభిస్తుంది.అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్ లోపాన్ని కూడా ఇది సరిచేస్తుంది.అయితే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే కీర దోసకాయను ప్రత్యేకించి కొన్ని పదార్థాలతో కలిపి అస్సలు తినకూడదు.

అలాగే అధికంగా కూడా కీరదోసకాయను తినకూడదు.ఇలా తినడం వలన కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.కీరదోసకాయను ముల్లంగి, టమాటా, పాలతో అస్సలు కలిపి తీసుకోకూడదు.ఇలా తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.అయితే కీరదోసకాయను అధికంగా తీసుకోవడం వలన కూడా కొన్ని దుష్ప్రభావాలు ఎదురవవచ్చు.ఎందుకంటే అధికంగా వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలను తీసుకోవడం వలన మూత్రపిండాలపై ప్రభావితం చూపుతుంది.

కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది.దీని వలన కిడ్నీ సమస్యలు వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube