అప్పుడు కమల్ హాసన్ చేసాడు కానీ ఇప్పుడు సూర్య మెప్పించగలడా ?

సూర్య..సౌత్ ఇండియాలోనే మంచి సత్త ఉన్న నటుడు.అతడి సామర్ధ్యం మీద ఎలాంటి అనుమానాలు లేవు.

 Suriya Will Be Acting In 13 Roles In His Next , Suriya,uv Creations, Studio Gree-TeluguStop.com

అయితే ఇప్పుడు తమిళనాట సూర్య చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.మరి ముఖ్యంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో పది భాషల్లో తెరకెక్కుతున్న యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ వారు నిర్మిస్తున్న కొత్త విజువల్ వండర్ పై ఎన్ని అంచనాలు నెలకొని ఉన్నాయ్.

ఇక ఈ చిత్రంలో సూర్య పోషించబోయే పాత్రల పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా, తమిళ నాడు లో మాత్రం సూర్య ఈ చిత్రంలో ఏకంగా 13 పాత్రల్లో కనిపించబోతున్నాడని అంటున్నారు.

Telugu Navratri, Kamalhaasan, Shivaji Ganesan, Studio Green, Suriya, Uv-Telugu S

అయితే 13 కాదు కేవలం ఐదు పాత్రల్లోనే కనిపిస్తాడు అంటూ సినిమా వర్గాలనుంచి వస్తున్న వార్త.ఏది ఏమైనా ఎన్ని పాత్రలు పోషించిన ఇంత పెద్ద సినిమాలో అది నిజంగా విశేషమే.ఇక సూర్య ని ఎన్ని పాత్రల్లో చూపించారు అనే విషయం సినిమా విడుదల అయ్యే వరకు బయటకు క్లారిటీ గా తెలిసేలా లేదు.

మరో వైపు ఇన్ని పాత్రల్లో దర్శకుడు సూర్యను ఎలా చూపిస్తాడో అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది.ఎందుకంటే ఇంతకు ముందు తొమ్మిది పాత్రల్లో 1966 లో శివాజి గణేశన్ నవరాత్రి అనే సినిమాలో నటించాడు.

అదే సినిమాను తెలుగు లో అక్కినేని నాగేశ్వర రావు పోషించగా అయన సైతం తొమ్మిది పాత్రలో కనిపించాడు.ఆ రికార్డు ని బీట్ చేస్తూ కమల్ హాసన్ దశావతారం తీశారు.

Telugu Navratri, Kamalhaasan, Shivaji Ganesan, Studio Green, Suriya, Uv-Telugu S

దశావతారం సినిమాలో కమల్ హాసన్ ని విభిన్నమైన పాత్రల్లో చూపించడానికి దర్శకుడు చాల కష్ట పడ్డాడు.లోక నాయకుడు కాబట్టి అయన కూడా ప్రతి పాత్రా కోసం చాల బాగా శ్రమించారు.అప్పట్లో గ్రాఫిక్స్ పైన ఎక్కువ ఖర్చు పెట్టకుండా మేకప్ కోసం ఎక్కువ కష్టపడ్డారు కమల్.ఆఖరుకి ముసలావిడ పాత్రలో కూడా కమల్ ఔరా అని అనిపించారు.ఇక ఇప్పుడు సూర్య 13 పాత్రలు పోషించడం అంటే అది మాములు విషయం కాదు.ఇప్పటికే గోవా లో ఫస్ట్ షెడ్యూల్ జరిగింది.

ఇక రెండవ షెడ్యూల్ కోసం శ్రీలంక కి వెళ్తున్నారు.ఇక 13 పాత్రలను పరిచయం చేయడం మాత్రం ఈ సినిమాలో దర్శకుడికి పెద్ద టాస్క్ అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube