ఏపీ ఎన్నికలలో గెలిచినా అనంతరం డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వరుస పెట్టి పర్యటనలు చేస్తున్నారు.ఒకపక్క పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ మరోపక్క ప్రజా సమస్యలు వినేందుకు సమయం కేటాయిస్తున్నారు.
ఇదే సమయంలో తనకు కేటాయించిన శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్… శనివారం తెలంగాణలో కొండగట్టు అంజన్నను( Kondagattu Anjanan in Telangana ) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
ఈ క్రమంలో మొక్కులు చెల్లించుకున్నారు.
పండితులు పవన్ కళ్యాణ్ కి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం పవన్ తిరిగి హైదరాబాద్ బయలుదేరడం జరిగింది.కాగా జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో( Kakinada ) పవన్ పర్యటన ఖరారు అయ్యింది.
తొలి రోజు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.ఆ తర్వాత పిఠాపురం జనసేన నాయకులతో సమావేశం అవుతారు.జులై రెండున కలెక్టరేట్ లో పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.అనంతరం జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీతో బేటి కాబోతున్నారు.
జులై 3న ఉప్పాడ తీరప్రాంతాన్ని పరిశీలిస్తారు.అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞత సభలో పాల్గొంటారు.
ఏపీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి 70 వేల మెజారిటీతో గెలుపొందారు.దీంతో ఎన్నికలలో గెలిచిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి పవన్ వస్తుండటంతో స్థానిక నేతలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.