ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ( YCP ) 175 స్థానాలకు 11 స్థానాలను మాత్రమే దక్కించుకోవడంతో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది ఈ క్రమంలో ఆ పార్టీలో కీలక నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. కొంతమంది పూర్తిగా రాజకీయాలకు దూరమవుతున్నట్లుగా ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలోనే సినీ కమెడియన్ ఆలీ( Comedian Ali ) వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్( Jagan ) సమక్షంలో వైసీపీలో చేరిన ఆలీ ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం ఏపీ అంతట నిర్వహించారు.
ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆలీకి రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని, ఒకవేళ అది కుదరని పక్షంలో ఎమ్మెల్సీగా( MLC ) ఆయన అవకాశం ఇస్తారని అంత అంచనా వేశారు.
కానీ ఆ రెండు పదవుల్లోనూ ఆలీ పేరును పరిగణలో తీసుకోలేదు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు( Electronic Media Advisor ) పదవిని కట్టబెట్టారు. దీంతో ఆలీ అసంతృప్తితోనే ఉంటూ వచ్చారు.2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేశారు.కానీ జగన్ మాత్రం ఆలీ పేరును పరిగణలోకి తీసుకోలేదు.
తాజాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆలీ ప్రకటించారు.వాస్తవంగా చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వైసీపీకి మద్దతు పలికినవారు చాలా తక్కువ మంది.
వారిలో ఆలీ కూడా ఒకరు. పార్టీ కోసం ఆలీ బాగానే కష్టపడ్డారు. కానీ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయడానికి గల కారణం సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద ఇచ్చిన సూచనే కారణంగా తెలుస్తోంది ఆయన సూచనలతోనే వైసీపీకి ఆలీ రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఆలీ రాజీనామా పై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని ఎదిరిస్తే అవకాశాలు దక్కవనే విషయం అందరికీ తెలిసిందేనని , ఆలీకి సినిమాలు తప్ప వేరే వ్యాపార వ్యవహారాలు లేవని అందుకే సినీ పెద్ద ఒత్తిడితో వైసిపికి రాజీనామా చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.