100 కోట్ల పైన మొదటి రోజు కలెక్షన్స్ సాధించిన ప్రభాస్ 5 సినిమాలు ఇవే

ప్రభాస్.ప్రస్తుతం ఈ హీరో కూడా ఇతని దరిదాపుల్లోకి వెళ్లే ప్రయత్నం చేసే సాహసం చేయడానికి ఆలోచించరు.అంతలా ప్రభాస్ స్టామినా ప్రపంచం మొత్తం ఇప్పుడు పెరిగిపోయింది.బాహుబలి తోనే ప్రభాస్ ప్రభంజనం మొదలైన ఇంతింతై వటుడింతై అన్న విధంగా ప్రతి సినిమాకి తన స్టామినాను పెంచుకుంటూ వెళుతున్నాడు ప్రభాస్.

 Prabhas First Day 100crores Collections Movies ,100crores Collections Movies, Pr-TeluguStop.com

బాలీవుడ్ లో కూడా ఎవరు ప్రభాస్ స్థానాన్ని అందుకోవాలంటే భయపడే స్టేజ్ లో అతడు ఉన్నాడు.తెలుగు సినిమాలు వదిలేయండి ఇండియాలో ఏ చిత్ర సీమ కూడా ప్రభాస్ స్టామినాని తట్టుకోడి నిలబడటం ఇప్పట్లో జరిగే పని కాదు.ప్రస్తుతం 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన ప్రభాస్ 5 సినిమాలు ఏంటో, అలాగే కల్కి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ గురించి కూడా ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కల్కి 2898 AD

( Kalki 2898 AD )

కల్కి సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో తన దూకుడుని ప్రదర్శిస్తుంది అలాగే మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా 191 కోట్ల రూపాయలను సాధించింది.ఇప్పటి వరకు ప్రభాస్ అన్ని సినిమాల్లో కెల్లా ఇదే అత్యంత ఎక్కువ వసూలు మొదటి రోజు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది.ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అఫీషియల్ గా ప్రకటించింది.

సలార్

( Salar )

కల్కి సినిమా కన్నా ముందు ప్రభాస్ నటించిన చివరి చిత్రం సలార్ దీనికి కూడా ఊహించని విధంగా మొదటిరోజు కలెక్షన్స్ వచ్చాయి అలాగే సూపర్ డూపర్ హిట్ గా ఈ చిత్రం నిలబడింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 176 కోట్ల రూపాయల వసూల్లు సాధించింది.

Telugu Crore Rupees, Adi Purush, Baahubali, Kalki Ad, Prabhas, Prabhas Day, Saah

ఆది పురుష్

( Adi Purush )

ఇక ప్రభాస్ కెరియర్ లోనే డిజాస్టర్ చిత్రంగా నిలిచిన ఆది పురుష్ సైతం మొట్టమొదటి రోజు మంచి వసూలు సాధించడం.సలార్ కన్నా ఈ చిత్రం ముందుగా విడుదలై 100 కోట్లకు పైగా వసూలు సాధించిన చిత్రంగా నిలబడింది.ఆది పురష్ మొట్టమొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూలు 146 కోట్లు.

Telugu Crore Rupees, Adi Purush, Baahubali, Kalki Ad, Prabhas, Prabhas Day, Saah

సాహో

( Saaho )

బాహుబలి తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సాహో సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ మొట్టమొదటి రోజు మాత్రం ఊహించని విధంగా 100 కోట్లకు పైగానే వసూల్లను సాధించింది.ఇక ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ మొట్టమొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లు.

Telugu Crore Rupees, Adi Purush, Baahubali, Kalki Ad, Prabhas, Prabhas Day, Saah

బాహుబలి 2

( Baahubali 2 )

బాహుబలి తోనే ప్రభాస్ ఫ్యాన్ ఇండియా ప్రభంజనం మొదలుకాగా మొదటి పార్ట్ కన్నా కూడా రెండవ పార్ట్ పెద్ద హిట్ అయింది అలా బాహుబలి 2 కి మొట్టమొదటిసారిగా మొదటి రోజు ప్రభాస్ 100 కోట్ల మార్క్ అందుకున్నాడు.ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి రోజు బాహుబలి 2 అందుకున్న కలెక్షన్స్ 200 కోట్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube