సాధారణంగా చాలా మంది రకరకాల జుట్టు సమస్యలు ఎదుర్కొంటారు.అందులో జుట్టు చిట్లిపోవడం కూడా ఒకటి.
చిట్లిపోవడం వల్ల జుట్టు నిర్జీవంగా కళ లేకుండా పోతుంది.ఇక సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది ఏవోవే ప్రయోగాలు చేస్తున్నారు.
మార్కెట్‌లో దొరికే ఎన్నో రకాల షాంపూలు వాడుతుంటారు.అయితే అలా చేయడం వల్ల జుట్టు చిట్లిపోవడం తగ్గకపోగా.
మరిన్ని సమస్యలు ఏర్పడతాయి.
అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ఫాలో అయితే.
ఖచ్చితంగా చిట్లిపోయిన జుట్టుకు సులువుగా చెక్ పెట్టవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
అందుకు ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో కొద్దిగా పెరుగు మరియు అరటి పండు గుజ్జు వేసి మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని శిరోజాలకు పట్టించి.అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
ఇలా వారినికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు చిట్లిపోవడం క్రమంగా తగ్గిపోతుంది.అలాగే అందరూ చేసే పొరపాటు.తలస్నానం చేసేందుకు బాగా వేడిగా ఉన్న నీళ్లు వాడటం.కానీ, అలా చేయడం వల్ల జుట్టు చిట్లిపోవడంతో పాటు డ్రైగా, వీక్ గా మారుతుంది.
అందుకే ఎప్పుడు తలస్నానం చేసిన గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి.
బాగా పండిన బొప్పాయి గుజ్జులో కొద్దిగా అవకాడో పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కేశాలను శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారినికి రెండు సార్లు చేయడం వల్ల కూడా జుట్టు చిట్లిపోయే సమస్య తగ్గుముఖం పడుతుంది.మరియు జుట్టు దృఢంగా, సిల్కీగా కూడా మారుతుంది.
ఇక జుట్టు చిట్లి పోవడం తగ్గాలంటే.కేశాలకు ప్రోటీన్లు చాలా అవసరం.అందుకే, అప్పుడప్పుడు ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను వాడటం మంచిదంటున్నారు.తద్వారా చిట్లిపోయిన జుట్టు సులువుగా చెక్ పెట్టవచ్చు.
అదే సమయంలో హెయిర్ ఫాల్ సమస్య కూడా క్రమంగా తగ్గుతుంది.