ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు అతన్ని సపోర్ట్ చెయ్యడానికి కారణం?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.ఈ క్రమంలోనే 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మిగిలిన రెండు వారాలు మరింత ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది.

 What Is The Reason For Rahul Sipliganj Support Him Now, Bigg Boss, Winner, Rahul-TeluguStop.com

ఇక 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి కామెంట్స్ చేస్తూ వారికి మద్దతు తెలుపుతున్నారు.

బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని విజేతగా నిలిచిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ కార్యక్రమం పై స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ సీజన్ విన్నర్ ఎవరో చెప్పేశారు.

ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఈ సింగర్ ఇప్పుడు తన మద్దతు తనకే అని తెలపడం వెనుక ఉన్న కారణం ఏమిటి అంటూ పలు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

ఇదిలా ఉండగా గతంలో ఒకసారి ఈ కార్యక్రమం గురించి మాట్లాడిన రాహుల్ ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ అందరూ ఎంతో అద్భుతంగా ఆడుతున్నారని, వీరిలో విన్నర్ ఎవరో చెప్పడం కష్టంగా ఉంది అంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు.ప్రస్తుతం ఈ సింగర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ సారి తనే అంటూ సన్నీ గురించి చెప్పుకొచ్చారు.

సన్నీ ఎంతో అద్భుతంగా ఆడుతున్నారని కచ్చితంగా తనే విన్నర్ అవుతారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఇలా రాహుల్ సన్నీని సపోర్ట్ చేయడంతో అతని అభిమానులు కూడా సన్నీని సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ వార్ వన్ సైడ్ అయింది అంటూ లవ్ సింబల్స్ తో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రాహుల్ సన్నికి మద్దతు తెలపడంతో సన్నీ అభిమానులలో కూడా కాస్త ధైర్యం వచ్చింది.

ఈ క్రమంలోనే తమ కంటెస్టెంట్ తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bigg Boss, Rahul Sipliganj, Suppoet, Telugu-Movie

ఇక టికెట్టు ఫినాలే రౌండ్ లో భాగంగా ఇప్పటికే శ్రీ రామచంద్ర అడుగు పెట్టిన విషయం తెలిసిందే.ఫినాలే లో ఉండబోయే మిగతా నలుగురు కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయం గురించి ఎంతో ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉండగా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన పలువురు కంటెస్టెంట్ లు వారి అభిప్రాయాల ప్రకారం బిగ్ బాస్ విన్నర్ వీళ్ళే అంటూ చెబుతున్నారు.

ఇలా పలువురు సెలబ్రిటీలు కొందరు కంటెస్టెంట్ లకు మద్దతు తెలపడంతో ఈ కార్యక్రమంపై ఎంతో ఆసక్తి నెలకొంది.అయితే ఎక్కువగా సన్నీ, షణ్ముఖ్ మధ్య పోటీ ఎక్కువగా ఉండబోతోందని తెలుస్తోంది.

బిగ్ బాస్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు.రన్నర్ గా ఎవరు ఉంటారు అనే విషయం తెలియాలంటే మరో రెండు వారాలు వేచి ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube