సై, హ్యాపీ, ఢీ, రెడీ, బొమ్మరిల్లు వంటి తెలుగు హిట్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది జెనీలియా.ఈ కుందనపు బొమ్మకు “బొమ్మరిల్లు( Bommarillu )” చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టింది.
అహహ హాసిని అంటూ అల్లరి పిల్ల హాసినిగా జెనీలియా( Genelia ) అద్భుతమైన నటన ప్రదర్శన కనబరిచింది.జెనీలియా అనే పేరు చెప్పగానే ముందుగా ఆమె బొమ్మరిల్లులోని యాక్టింగ్ మనుకు గుర్తుకొస్తుంది.
అంతలా ఆమె నటన ప్రేక్షకులపై ముద్ర వేసింది.శశిరేఖా పరిణయం, ఆరంజ్ వంటి భారీ డిజాస్టర్స్ వచ్చాక ఆమెను టాలీవుడ్ కి దూరమైంది.
బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడ నటించడం ప్రారంభించింది.అక్కడే నటుడు రితేష్ దేశ్ ముఖ్ తో తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇప్పుడు మారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్యూట్ హీరోయిన్ “సత్యం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది.అయితే జెనీలియా నటించిన 4 సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉందని సినిమా ఫ్యాన్స్ కనుగొన్నారు.ఆ నాలుగు సినిమాలు ఢీ, రెడీ, శశిరేఖా పరిణయం, నా ఇష్టం.
మరి వీటిలో ఉన్న ఆ కామన్ పాయింట్ ఏంటో తెలుసుకుందామా.
ముందుగా ఢీ సినిమా( Dhee ) గురించి చెప్పుకుందాం.ఈ మూవీలో శ్రీహరి చెల్లెలుగా నటించింది జెనీలియా.శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీహరి లోకల్ మాఫియా డాన్ గా కనిపించాడు.
అయితే ఈ మూవీలో జెనీలియా పెళ్లికి ముందే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.ఇక తరుణ్ హీరోగా నటించిన శశిరేఖా పరిణయం సినిమాలోనూ సడన్ గా పెళ్లి అని పేరెంట్స్ చెప్పడంతో ఇంట్లో నుంచి ఎస్కేప్ అయ్యే పాత్రలో ఆమె నటించింది.
రామ్ పోతినేని హీరోగా వచ్చిన “రెడీ” సినిమాలో జెనీలియా పూజ పాత్రలో నటించింది.ఈ సినిమాలో కూడా ఆమె క్యారెక్టర్ పేరు పూజ.ఇందులో మేనమామలు ఆస్తి కోసం ఆమెకు బలవంతపు పెళ్లి చేయాలనుకుంటారు దాంతో ఇంట్లో నుంచి ఆమె పారిపోతుంది.చివరికి హీరోని పెళ్లి చేసుకుంటుంది.
ఫ్లాప్ మూవీ “నా ఇష్టం“లో కూడా జెనీలియా క్యారెక్టర్ ఇంట్లోంచి జంప్ అవుతుంది.పెళ్ళికి ముందు బయటికి రావడం అనేది ఈ నాలుగు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ గా కనిపించింది.
అయితే ఇలా కామెంట్ పాయింట్ తో వచ్చినా 2 సినిమాలు హిట్ అయ్యాయి.అవి రెండూ శ్రీను వైట్ల( Srinu Vaitla ) డైరెక్ట్ చేసినవే కామన్.