ఆడవారు తమ పుట్టినరోజు, పెళ్లి రోజును భర్తలు గుర్తుపెట్టుకోవాలని బాగా కోరుకుంటారు.వాటిని మరిచిపోతే పెద్ద యుద్ధమే చేస్తారు.
అంతేకాదు తమ హస్బెండ్ బర్త్‌డేని కూడా వీరు బాగా ప్లాన్ చేస్తారు.దాన్ని మెచ్చుకోకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు.
అయితే ఇటీవల ఒక మహిళ తన భర్త కోసం ఓ పుట్టినరోజు పార్టీని ఏర్పాటు చేసింది.అయితే అతడు దానిని పొగడలేదని తీవ్రమైన కోపానికి గురైంది.
అంతేకాదు విషం కూడా కలిపింది.ఈ ఘటన మిస్సోరీలో సంభవించి రాష్ట్రంలో సంచలనం రేపింది.
47 ఏళ్ల మిచెల్ వై పీటర్స్( Mitchell Y Peters ) అనే మహిళ తన భర్త 50వ పుట్టినరోజు పార్టీని మెచ్చుకోకపోవడంతో కోపంతో సోడాలో విషం కలిపి అతనికి తీవ్ర అనారోగ్యం కలిగించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లెబనాన్‌కు ( Lebanon )చెందిన పీటర్స్, తన భర్త పుట్టినరోజు వేడుక కోసం చాలా కష్టపడి ఏర్పాట్లు చేసింది.
కానీ ఆమె భర్త పార్టీని పూర్తిగా ఆస్వాదించలేదని, తన కృషిని తక్కువగా అంచనా వేశాడని భావించి ఆగ్రహం చెందింది.అదే కోపంతో తన భర్త సోడాలో విషం కలిపింది.
తనకు విషం ఇచ్చారని తెలుసుకున్న పీటర్స్ ( Peters )భర్త, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు దర్యాప్తు చేసి పీటర్స్‌ను అరెస్ట్ చేశారు.ఆమెపై ఫస్ట్-డిగ్రీ దాడి, సాయుధ క్రిమినల్ చర్యతో సహా తీవ్రమైన ఆరోపణలు ఎదురవుతున్నాయి.పీటర్స్ భర్త, సంఘటన వెలుగులోకి రావడానికి వారాల ముందు నుంచే తన సోడాలో వింత రుచిని గమనించినట్లు తెలిపాడు.
కానీ వింత రుచిని పట్టించుకోకుండా సోడా తాగడం కొనసాగించాడు.కొంతకాలం తర్వాత అతనికి తీవ్రమైన అనారోగ్యం కలిగింది.ఈ ఘటన మిస్సోరీలో( Missouri ) సంచలనం రేపింది.భార్యాభర్తల మధ్య చిన్న సంఘర్షణ ఇంత పెద్ద విషాదానికి దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు.
ఈ కేసులో ఇంటి లోపల ఏర్పాటు చేసిన కెమెరా ఫుటేజీ కీలక ఆధారంగా మారింది.ఆ దృశ్యాలలో పీటర్స్ సోడా డబ్బాతో పాటు విషం డబ్బా తీసుకొచ్చి, తరువాత వాటిని తిరిగి అదే స్థానంలో ఉంచడం కనిపించింది.దీంతో భార్య తన పానీయాలలో తెలియకుండా విషం కలుపుతోందని భర్త అనుమానం బలపడింది.తన భద్రత కోసం, భర్త కొత్త, ఎవరూ తాకని సోడా డబ్బాలను ఫ్రిజ్‌లో ఉంచాడు.
కానీ, వాటిలో కూడా భార్య విషం కలుపుతోందని అనుమానించాడు.అంతేకాకుండా, విషం డబ్బా ఖాళీ అయ్యి, కొత్త డబ్బా వాడకానికి సిద్ధంగా ఉండటం కూడా అనుమానాన్ని రేపించింది.
భార్య ఆర్థిక లాభం కోసమే ఇలా చేసి ఉండవచ్చని భర్త అనుమానించాడు.ఆమె తన $5 లక్షల జీవిత బీమా డబ్బును పొందాలని ప్రయత్నించిందా లేదా వివాహేతర సంబంధం ఉందా అని కూడా అనుమానించాడు.
భర్త ఫిర్యాదు మేరకు లాక్లేడ్ కౌంటీ షరీఫ్ ఆఫీస్ దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించింది.పీటర్స్ తప్పును ఒప్పుకోవడంతో ఆమెను అరెస్టు చేసింది.