టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆయన దర్శకత్వం వహించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు శేఖర్ కమ్ముల.ఇకపోతే శేఖర్ కమ్ముల టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాగార్జున అలాగే ధనుష్ లతో ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా పేరు కుబేర.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే ఈ సినిమా తరవాత శేఖర్ కమ్ముల ఏ హీరోతో సినిమా చేస్తాడు? అనే విషయంపై దాదాపు ఒక స్పష్టత వచ్చింది.ఈసారి ఆయన నానితో జట్టు కట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.ఈమేరకు ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని ఇన్ సైడ్ వర్గాల టాక్.ఏసియన్ సునీల్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నాడు.ఆ తరవాత హిట్ 3 సినిమాని పట్టాలెక్కిస్తాడు.
ఈ రెండూ పూర్తయిన తరవాతే శేఖర్ కమ్ముల సినిమా ఉంటుంది.శేఖర్ కమ్ముల సినిమా తరవాత సినిమా స్పీడుగా తీసే రకం కాదు.
రెండు సినిమాల మధ్య స్క్రిప్టు కోసం గ్యాప్ తీసుకోవడం ఆయనకు అలవాటు.‘కుబేర( Kubera )’ తరవాత కూడా అదే జరగబోతోంది.‘కుబేర’ విడుదలైన తరవాత ఆయన స్క్రిప్టుపై కసరత్తులు చేయాల్సివుంది.ఆ తరవాతే నాని సినిమా మొదలవుతుంది.ఇకపోతే హీరో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.చివరగా నాని హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.
ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.