వేస‌విలో చెరుకు ర‌సాన్ని ఇలా తీసుకుంటే ఇక మీకు తిరుగుండ‌దు!

వేస‌వి కాలం వ‌చ్చేసింది.రోజురోజుకు ఎండ‌ల తీవ్ర‌త పెరిగిపోతోంది.

 Benefits Of Taking Sugarcane Juice In Summer! Sugarcane Juice, Summer, Latest Ne-TeluguStop.com

మార్చి నెల‌లోనే భానుడి ప్ర‌తాపం ఇలా ఉందంటే.మే నెల‌లో ఇంకెంత వేడిగా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

అందుకే వేస‌వి కాలంలో ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.అలాగే ఘ‌న ప‌దార్థాలు కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ద్ర‌వ ప‌దార్థాల‌నే ఎక్కువ‌గా తీసుకోవాలి.

అటువంటి వాటిలో చెరుకు ర‌సం ఒక‌టి.మ‌ధుర‌మైన రుచిని క‌లిగి ఉండ‌ట‌మే కాదు.

కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐర‌న్‌, మాంగనీస్, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోష‌కాలు సైతం చెరుకు ర‌సంలో పుష్క‌లంగా నిండి ఉంటాయి.

అందుకే చెరుకు ర‌సం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా వేస‌విలో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చెరుకు ర‌సాన్ని తీసుకుంటే ఇక మీకు తిరుగుండ‌దు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

ఒక గ్లాస్ చెరుకు ర‌సాన్ని తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ అల్లం ర‌సం, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం, వ‌న్ టేబుల్ స్పూన్ పుదీనా ర‌సం, చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసి బాగా క‌లిపి సేవించాలి.

Telugu Tips, Latest, Sugarcane-Telugu Health Tips

ఈ విధంగా చెరుకు ర‌సం తీసుకుంటే గ‌నుక వేస‌విలో డీహైడ్రేష‌న్, వ‌డ‌దెబ్బ వంటి స‌మ‌స్య‌ల‌ బారిన ప‌డ‌కుండా ఉంటారు.అలాగే వేస‌వి వేడిని త‌ట్టుకునే శ‌క్తి ల‌భిస్తుంది.శ‌రీరం ఎప్పుడూ కూల్‌గా, యాక్టివ్‌గా ఉంటుంది.

నీర‌సం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, ఒత్తిడి, అందోళ‌న‌, చికాకు, అధిక దాహం వంటి స‌మ‌స్య‌ల‌న్నీ దూరం అవుతాయి.అంతే కాదు, చెరుకు ర‌సాన్ని పైన విధంగా త‌యారు చేసుకుని తాగితే ఎముక‌లు దృఢంగా మార‌తాయి.

గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.క‌డుపులో మంట‌, గ్యాస్, మ‌ల‌బ‌ద్ధ‌కం, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మ‌రియు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ సైతం బ‌ల‌ప‌డుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube