తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారుతున్నాయి.విషయంలోకి వెళ్తే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు.
ఇప్పటివరకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.ఇదిలా ఉంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ( BRS party ) సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై మండిపడ్డారు.
గాలికి కొట్టుకుపోయేది గడ్డి పోచలు మాత్రమే అని విమర్శించారు.జగిత్యాలకు పట్టిన శని పోయిందని నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్ని సందర్భాలలో కష్టాలు వచ్చినప్పుడు మనుషుల విలువ తెలుస్తది.గాలికి గడ్డపారలు కొట్టుకపోవు.గట్టి నాయకులు కొట్టుకుపోరు.గాలికి కొట్టుకుపోయేది గడ్డి పోచలు మాత్రమే.కట్ట పారాలాంటి మీరు వెళ్ళలేదు ఒక గడ్డి పోచ మాత్రమే కొట్టుకుపోయింది ఎమ్మెల్యే సంజయ్ ను ఉద్దేశించి కేటీఆర్ చురకలాంటించారు.కవితక్క తో సహా వేల మంది కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అయ్యారు.
ఇప్పుడా ఎమ్మెల్యే దొంగల్లో కలిసి ఉండు.రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి పోయుండు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి దమ్ముంటే ఎన్నికలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.ఈ క్రమంలో హస్తం గుర్తుపై గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలంటూ గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన వీడియో జగిత్యాల కార్యకర్తల సభలో కేటీఆర్ ప్రదర్శించడం జరిగింది.
పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Jagtial MLA Sanjay Kumar ) ను వెంటపడి మరి ఓడిద్దామని పార్టీ క్యాడర్ కి కేటీఆర్ పిలుపునిచ్చారు.