తెలంగాణ కాంగ్రెస్( Congress ) అధ్యక్షుడి ఎంపికపై ఇంకా తర్జన భర్జన లు జరుగుతున్నాయి.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy )సీఎం గానూ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండడంతో, రెండిటిని బ్యాలెన్స్ చేయడం ఆయనకు కష్టంగా మారింది.
అందుకే తనకు పిసిసి అధ్యక్షుడిగా తప్పించాలని ఇప్పటికే అధిష్టానానికి విన్నవించారు.ఇక ఈనెల 7వ తేదీతో రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తవుతాయి.
దీంతో కొత్త అధ్యక్షుడు ఎంపికపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపి విషయంలో రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది.
ఆయన సూచించిన వారికే పిసిసి అధ్యక్ష పీఠం కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తి చూపిస్తున్నారు అయితే కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో వేటిని పరిగణలోకి తీసుకుంటారనేది ఉత్కంఠ కలిగిస్తుండగా, గతంలో అనుసరించిన పాత వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేసి సక్సెస్ అవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది.
గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రిగా ఉండగా, బీసీ ( B.C )సామాజిక వర్గానికి చెందిన వారికి పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం వంటివి జరిగాయి. ఆ ఫార్ములా వర్కౌట్ కావడంతో ఇప్పుడు అదే ఫార్ములాను ఉపయోగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడంతో, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో ఆ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానం వద్ద లాభియింగ్ మొదలుపెట్టారు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పిసిసి( PCC ) అధ్యక్ష పదవికి బాగా పోటీ పెరిగింది.
ముఖ్యంగా గౌడ సామాజిక వర్గానికి ఈ ఛాన్స్ దక్కే అవకాశం ఉందనే ప్రచారంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు పైరవీలు మొదలుపెట్టారు.ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సీనియర్ నేత మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొంతమంది ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు
.