బాలయ్య బోయపాటి మూవీలో స్టార్ హీరోయిన్ కూతురు.. ఆ పాత్రలో కనిపిస్తారా?

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కాంబినేషన్ లో ఇప్పటికే సింహా లెజెండ్ అఖండ వంటి సినిమాలో విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే.వీరి కాంబోలో చివరగా అఖండ సినిమా విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

 Laya Daughter In Akhanda 2 Movie Details, Laya, Laya Daughter, Tollywood, Balakr-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమా రాబోతోంది.అఖండ సినిమా కథకు కొనసాగింపుగా ప్రస్తుతం అఖండ 2( Akhanda 2 ) రూపొందుతోంది.

అందుకే అందులోని పాత్రలను ఈ సినిమాలో కొనసాగించబోతున్నారు.

Telugu Balakrishna, Boyapati, Boyapati Srinu, Laya, Laya Akhanda, Laya Shloka, S

అయితే అఖండ సినిమాలో చిన్న పాప పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ పాప పాత్రను మరింతగా అఖండ 2 లో చూపించేందుకు దర్శకుడు బోయపాటి ప్లాన్‌ చేస్తున్నారు.అఖండ 2 సినిమాలో ఆ పాప పాత్ర కోసం సీనియర్‌ హీరోయిన్‌ లయ కూతురు శ్లోకాను( Laya Daughter Sloka ) ఎంపిక చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

గత కొంత కాలంగా శ్లోకా ను సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేయాలని లయ భావిస్తోంది.అందుకు సరైన సమయం ఇదే అంటూ లయ నిర్ణయించుకుందట.

Telugu Balakrishna, Boyapati, Boyapati Srinu, Laya, Laya Akhanda, Laya Shloka, S

అందుకే బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటింపజేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.మరి ఈ వార్తల్లో నిజా నిజాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.ఈ వార్తలపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఇకపోతే ఇటీవల కాలంలో బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ వరుస హిట్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.ఈ సినిమా విడుదల తర్వాత బాలయ్య బాబు బోయపాటి కాంబోలో రాబోతున్న అఖండ 2 సినిమాలో నటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube