ప్రవాసీ భారతీయ దివస్ .. ఎన్ఆర్ఐలకు అడ్వైజరీ జారీ చేసిన ఒడిషా ప్రభుత్వం

వచ్చే నెలలో ఒడిషాలోని( Odisha ) భువనేశ్వర్‌లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌ (పీబీడీ)కి( Pravasi Bharatiya Divas ) హాజరయ్యే ఎన్ఆర్ఐ ప్రతినిధులకు అధికారులు ఒక అడ్వైజరీని జారీ చేశారు.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ఒడిషా ప్రభుత్వం సంయుక్తంగా జనవరి 8 నుంచి 10 వరకు ఇక్కడి జనతా మైదాన్‌లో పీబీడీ కన్వెన్షన్ 18వ ఎడిషన్ నిర్వహిస్తున్నాయి.

 Odisha Government Issues Travel Advisory For Nris Who Participate In Pravasi Bha-TeluguStop.com

పీబీడీలో పాల్గొనే అతిథులు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాలను( Tourist Places ) సందర్శిస్తారని ఒడిషా పర్యాటక శాఖ అధికారి ఒకరు తెలిపారు.ఈ సమయంలో ఏం చేయాలో, చేయకూడదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడ్వైజరీని జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

ప్రధానంగా పూరీ జగన్నాథ ఆలయం( Puri Jagannath Temple ) వద్ద జేబు దొంగలు, కోతుల గురించి ఈ అడ్వైజరీలో హెచ్చరించినట్లు తెలిపారు.

Telugu Nritravel, Nris, Odisha, Odishapravasi, Odisha Tourism, Purijagannath, Tr

12వ శతాబ్ధం నాటి ఈ మందిరంలో దాదాపు 1000కి పైగా కోతులు ఉన్నాయి.2011-12 సమయంలో వీటిని పట్టుకుని అడవికి తరలించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.పూజా మందిరం నుంచి కోతులను తరలించడానికి లంగూర్లను ఉపయోగించాలని ప్రతిపాదన ఇంకా అమల్లోకి రాలేదని అధికారులు తెలిపారు.

దేవాలయం, ఇతర ప్రాంతాలకు ఎన్ఆర్ఐల( NRI’s ) సందర్శనకు సౌకర్యాలు కల్పిస్తామని ఆలయ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Telugu Nritravel, Nris, Odisha, Odishapravasi, Odisha Tourism, Purijagannath, Tr

ట్రావెల్ అడ్వైజరీ( Travel Advisory ) ప్రకారం పీబీడీకి హాజరయ్యే వారు పూరీ ఆలయంతో పాటు లింగరాజ్ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం వంటి పుణ్యక్షేత్రాలలో మార్గదర్శకాలను పాటించాలని ఒడిషా పర్యాటక శాఖ సూచించింది.జగన్నాథ ఆలయం సహా ప్రముఖ దేవాలయాలలో హిందువులు కానివారికి ప్రవేశ నిషేధంతో పాటు మందిరం ఆవరణలో మొబైల్ ఫోన్‌లో, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై పూర్తి నిషేధం వంటి ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.పీబీడీకి వచ్చే ఎన్ఆర్ఐలు భువనేశ్వర్, పూరీ, కటక్ సహా దాదాపు 28 పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది.

అలాగే అతిథుల రాక నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube