తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ హీరోలు మాత్రం నందమూరి ఫ్యామిలీ(Nandamuri Family) మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ సినిమాలు చేయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ భారాన్ని కూడా మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.
ముఖ్యంగా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ (Balayya, Jr.NTR)లు మాత్రం ఈ విషయంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారనే చెప్పాలి.

మరి ఇద్దరూ నందమూరి హీరోలు ఒక సినిమాలో నటించాల్సింది.కానీ అనుకోని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు.అయితే దమ్ము సినిమా సమయం లో వీళ్ళిద్దరిని పెట్టి బోయపాటి శ్రీను ఒక సినిమాకి ప్రణాళికలు రూపొందించాడు.కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా అయితే కార్యరూపం దాల్చలేదు.
ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబోలో కనక సినిమా వచ్చినట్టైతే ఆ సినిమా భారీ రికార్డులను సృష్టించేది అంటూ చాలామంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఇక బోయపాటి బాలకృష్ణ, ఎన్టీఆర్ కి సరిపడా కథను రెడీ చేశారట.
అప్పుడు బాలయ్య ఎన్టీఆర్ ల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి ఇక ఆ సమయంలో వాళ్లు సినిమా చేయాలని అనుకున్నప్పటికి వాళ్లు వాళ్ళ సబ్జెక్టులో బిజీగా ఉండడం వల్ల సినిమా చేయలేకపోయారు.

ఆ తర్వాత కూడా కొన్నిసార్లు ఆ ప్రపోజల్ వచ్చినప్పటికీ ఇద్దరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట.ఇక ప్రస్తుతం వాళ్ల మధ్య మాటలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు చేసే అవకాశాలైతే లేవు… మరి మోక్షజ్ఞతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి.ఎందుకంటే రాబోయే తరంలో వీళ్ళిద్దరూ స్టార్ హీరోలుగా కొనసాగితే మాత్రం వీళ్లిద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి…
.