బిగ్ బాస్ షో వల్లే నా పేరు నాశనం.. తేజస్వి మదివాడ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ తేజస్విని మదివాడ ( Anchor Tejaswini Madivada )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తేజస్విని ప్రస్తుతం కొన్ని షోలకు యాంకర్ గా చేస్తూ అడపాదడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 Tejaswi Madivada About Biggboss Season2, Tejaswi Madivada, Bigg Boss 2, Sensatio-TeluguStop.com

ఈమె హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.అలాగే ఆహా ఓటిటి( Aha OTT ) మీద కాకమ్మ కథలు పేరుతో ఒక షోకి హోస్ట్ గా చేస్తోంది.

ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తూ బోల్డ్ నటిగా పేరు తెచ్చుకుంది.అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తూ ఉంటుంది.

అలాగే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడు చేరువుగా ఉంటుంది తేజస్విని.

Telugu Bigg Boss, Sensational, Tejaswimadivada, Tollywood-Movie

చెప్పుతే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ అర్థమయిందా అరుణ్ కుమార్ సీజన్ 2( Arun Kumar Season 2 ) అనే వెబ్ సిరీస్ లో బికినీ వేసుకుని కనిపించిన విషయం తెలిసిందే.ఆ సంగతి పక్కన పెడితే ఒక షోలో బిగ్ బాస్ షో గురించి స్పందించిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా తేజస్విని మాట్లాడుతూ.

నా పేరు సగం నాశనం కావడానికి బిగ్ బాస్ సీజన్ 2 ( Bigg Boss Season 2 )ఒక కారణం.నేను జర్నలిజం స్టూడెంట్ ని.ఒక ప్రోడక్ట్ ని అమ్మాలంటే ఎలాంటి ప్రోపగాండా చేస్తారో ఆ సీజన్ లో అలానే నా మీద ప్రోపగాండా చేశారు.నా మీద ఒక ప్లాన్ ప్రకారమే నెగటివ్ ప్రోపగాండా జరిగింది.

Telugu Bigg Boss, Sensational, Tejaswimadivada, Tollywood-Movie

దాన్ని తీసుకోవడం నాకు కష్టంగా అనిపించింది.బిగ్ బాస్ 2 కి వెళ్ళినప్పుడు నా వయసు 25.ఆ సీజన్ నన్ను చాలా బాడ్ చేసింది.జనాల్లోకి ఒక ఇమేజ్ వచ్చేసాక అది మార్చడం చాలా కష్టం.

కాబట్టి ప్రజల ఆలోచనను నేను మార్చలేను.నేను ఎలా ఉండాలి అనుకుంటానో అలాగే ఉంటాను.

నేను ఏ బిగ్ బాస్ సీజన్ కూడా చూడను.డబ్బులు తీసుకుని చెక్కేసే టైపు.

బిగ్ బాస్ కి ఒకసారి వెళ్లి వచ్చాక సిగ్గున్నోడు ఎవడైనా మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్తాడా.నేను వెళ్లాను బిగ్ బాస్ ఓటిటికి వెళ్ళా డబ్బులు.

చూడడానికి రిచ్ కిడ్ కనిపిస్తా కానీ నాకు మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి.కాబట్టి బుల్లితెర మీద ఎక్కువగా నేను కనిపించడానికి కారణం కేవలం డబ్బుల కోసమే అని తేజస్విని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా తేజస్విని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube