మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన( Ram Charan, Upasana ) దంపతులకు పెళ్లయి 11 ఏళ్ల తర్వాత క్లీంకార( Klin Kara ) అనే ఒక చిట్టి పాప జన్మించిన విషయం తెలిసిందే.ఈ చిన్నారి రాకతో మెగా ఫ్యామిలీ పేట్ మారిపోయింది.
ఈ చిన్నారి ఏ క్షణాన భూమి పై అడుగుపెట్టిందో కానీ అప్పటి నుంచి అన్ని శుభాలే జరుగుతున్నాయి.క్లీంకార జన్మించిన తర్వాత మెగా ఫ్యామిలీలో ఒకదాని తర్వాత ఒకటి శుభకార్యాలు జరగడంతో దీనికంతటికి కారణం క్లీంకార అంటూ ఒక రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించారు అభిమానులు.
ఆ సంగతి పక్కన పెడితే.క్లీంకార జన్మించినప్పటి నుంచి ఆమె ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు మెగా ఫ్యామిలీ.
ఆ చిన్న చిన్నారి ఫేస్ ను రివిల్ చేయండి అని వందలాది వేలాది మంది అభిమానులు రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆ చిన్నారి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.దీంతో ఎప్పుడెప్పుడు ఆ చిన్నారిని పూర్తిగా చూస్తామా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ వస్తున్నారు.అయితే ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణలు ఫలించాయి.తాజాగా ఉపాసన క్లీంకార ఫేస్ ను చూపించింది.అయితే ఇందులో కూడా ఆమె పూర్తిగా చూపించలేదు.తన తాత, అమ్మమ్మలతో క్లీంకార ఇలా అపోలోలోని గుడికి వచ్చింది అంటూ క్లీంకార ఫోటోని ఉపాసన షేర్ చేసింది.
క్లీంకారను ఇంత వరకు ఎలా ఉంటుందో అనేది పూర్తిగా రివీల్ చేయలేదన్న సంగతి తెలిసిందే.అలా ఫేస్‌ను రివీల్ చేసే మూమెంట్ ను కూడా చాలా పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసేలా ఉన్నారు.
ఉపాసన తన కూతురు మొహం బయటకు కనిపించకుండా ఉండేందుకు చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు.కానీ తిరుమలలో ఓ సారి క్లీంకార రూపం రివీల్ అయింది.ఆ శ్రీవారి సన్నిధిలో అలా క్లీంకార రూపం చూడటంతో మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో సంతోషించారు.గారాల పట్టి చిట్టి తల్లి అంటూ క్లీంకార మీద అందరూ ప్రేమను కురిపించారు.
క్లీంకార రాకతో ఈ ఏడాది అంతా కూడా మెగా నామ సంవత్సరంగా మారిందని అంటుంటారు.తాజాగా తన అమ్మమ్మ, తాత, ముత్తాతలతో క్లీంకార గుడికి వచ్చిందంటూ ఉపాసన షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఈరోజు మా హాస్పిటల్ లోని టెంపుల్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి తన తాత, ముత్తాతలతో కలిసి క్లీంకార దైవ దర్శనానికి వచ్చింది.క్లీంకారను అలా చూస్తుంటే నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది.
ఈ టెంపుల్ కీ నాకు అవినాభావ సంబంధం ఉంది.నాకు ఎంతో ప్రత్యేకమైంది ఈ ఆలయం.
ఇవి నాకు వెలకట్టలేని క్షణాలు.ఓం నమో వేంకటేశాయ అంటూ ఉపాసన పోస్ట్ వేసింది.
ఆ పోస్టులో ఉపాసన తన కూతురి ఫేస్ ని కొంచెం రివీల్ చేసింది.అది చూసి అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.