ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) మొదటి స్థానం లో ఉన్నాడు.ఆయన మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.హనుమాన్ సినిమాతో( Hanuman Movie ) పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం బాలయ్య బాబు( Balayya Babu ) కొడుకు అయిన మోక్షజ్ఞతో( Mokshagna ) ఒక సినిమాను చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.
ఇక దాంతో పాటుగా హనుమాన్ సినిమాకి సీక్వల్ గా జై హనుమాన్( Jai Hanuman ) అనే సినిమాని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి కనిపించబోతున్న విషయం మనకు తెలిసిందే.
మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ యంగ్ డైరెక్టర్ కి చాలా మంచి గుర్తింపైతే లభిస్తుంది.అలాగే పాన్ ఇండియాలో కూడా తనకంటూ ఒక మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది.కాబట్టి ప్రశాంత్ వర్మ ఇకమీదట నుంచి భారీ సక్సెస్ లను సాధిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు కొడుకుతో ప్రశాంత్ వర్మ చేయాల్సిన సినిమా ఆగిపోయింది అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి.అయితే ఈ విషయం మీద అటు బాలయ్య బాబు గానీ ప్రశాంత్ వర్మ గాని ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు.
కాబట్టి ఈ సినిమా ఉందా ఆగిపోయిందా? అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రావాల్సిన అవసరమైతే ఉంది.
మరి మొత్తానికైతే బాలయ్య బాబు మనసు మార్చుకొని ఈ సినిమాని వేరే దర్శకుడితో చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి( Venky Atluri ) డైరెక్షన్ లో మోక్షజ్ఞని పరిచయం చేయించాలనే ఉద్దేశ్యంతో బాలయ్య బాబు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.