సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అరెస్ట్ అయితే సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతుందనే సంగతి తెలిసిందే.బన్నీ అరెస్ట్( Bunny arrested ) కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది.
గత కొన్ని రోజులుగా బన్నీ అరెస్ట్ గురించి సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవుతుండగా ఆ వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో “కలిసుంటే నిలబడతాం.
విడిపోతే పడిపోతాం” అని ట్వీట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ట్విట్టర్ అకౌంట్ లో మాత్రం అలాంటి ట్వీట్ ఏదీ కనిపించడం లేదు.
మరోవైపు బన్నీకి పదేళ్ల జైలు శిక్ష అంటూ జరుగుతున్న ప్రచారం నిజమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.ఆరోపణలు ప్రూవ్ అయితే ఏడాది నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
అయితే ఆ సెక్షన్లను ప్రూవ్ చేయడం సులువు కాదని తెలుస్తోంది.

బన్నీ తప్పు ఉందని ప్రూవ్ చేయడంలో పోలీసులు సఫలమవుతారో లేదో చూడాలి.శుక్రవారం రోజున బన్నీని అరెస్ట్ చేయడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం పరిస్థితులు అంతా బన్నీకి వ్యతిరేకంగా మారుతున్నాయి.
బన్నీ విషయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. నాంపల్లి ట్రయల్ కోర్ట్ ( Nampally Trial Court )ఈ కేసు విషయంలో ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.

బన్నీపై కేసులు క్వాష్ చేయాలనే పిటిషన్ వాయిదా పడగా ఈలోపే బన్నీ ట్రయల్ కోర్టుకు హాజరు కానున్నారని సమాచారం అందుతోంది.ఇప్పటికే ఈ కేసు విషయంలో సంధ్య థియేటర్ కు సంబంధించిన పలువురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.బన్నీ విషయంలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకునే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.ఈ వివాదం విషయంలో బన్నీ తప్పు లేదని భోగట్టా.