బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో(Buckingham Palace) పనిమనిషిగా పనిచేసే 24 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు.నేరపూరిత నష్టం, తాగి గొడవ చేసిన ఆరోపణలపై ఆమెను సెంట్రల్ లండన్‌లో (central London)అదుపులోకి తీసుకున్నారు.
మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, క్రిస్మస్ వేడుక(Christmas celebration) హింసాత్మకంగా మారిన తర్వాత మంగళవారం రాత్రి ఈ అరెస్టు జరిగింది.
సుమారు 50 మంది ప్యాలెస్ సిబ్బంది విక్టోరియాలోని ఒక బార్‌లో రాత్రిపూట విందు చేసుకుంటుండగా, ఈ మహిళ గొడవకు దిగింది.
ఆమె ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగి, బార్ మేనేజర్‌ను(Bar manager) గుద్ది కొన్ని గాజు గ్లాసులు పగలగొట్టిందని సమాచారం.సెక్యూరిటీ సిబ్బంది శాంతింపజేయడానికి ప్రయత్నించిన తర్వాత కూడా ఆమె గ్లాసులు విసురుతూనే ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.“ఒక మహిళ రాత్రిపూట ఇంత పిచ్చిగా ప్రవర్తించడం నేను ఎప్పుడూ చూడలేదు” అని ఒక ప్రేక్షకుడు వ్యాఖ్యానించారు.
ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో(police station) ఉంచారు.ఆమె అనుచిత ప్రవర్తనకు జరిమానా విధించిన తరువాత, దాదాపు 24 గంటల తర్వాత ఆమెను మరుసటి రోజు విడుదల చేశారు.బకింగ్‌హామ్ ప్యాలెస్(Buckingham palace) ఈ ఘటనను ధృవీకరిస్తూ, దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది.ప్యాలెస్ ప్రతినిధి మాట్లాడుతూ, బార్‌లో జరిగిన సమావేశం అధికారిక ప్యాలెస్ క్రిస్మస్ పార్టీ కాదని, ప్యాలెస్‌లో జరిగిన ముందస్తు విందుకు హాజరైన కొంతమంది సిబ్బంది అనధికారికంగా పాల్గొన్న కార్యక్రమం అని వివరించారు.“వాస్తవాలను పూర్తిగా విచారిస్తాం, అవసరమైన చోట తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం” అని వారు తెలిపారు.ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.ప్యాలెస్‌లో పనిమనిషి అరెస్ట్ అనే కథనాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.అయితే ఇలాంటి పరిస్థితిని నిర్వహించడానికి కఠినమైన ప్రక్రియను అనుసరిస్తామని ప్యాలెస్ హామీ ఇచ్చింది.