8 పదుల వయస్సులో విజిల్స్ వేయించే నటన.. అమితాబ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనా?

కల్కి సినిమాలో ప్రభాస్( Prabhas ) పాత్రతో పోల్చి చూస్తే అమితాబ్ బచ్చన్ పాత్ర నిడివి ఎక్కువనే సంగతి తెలిసిందే.ప్రభాస్ వల్లే కల్కి( Kalki ) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడినా సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో అమితాబ్ ప్రభాస్ ను డామినేట్ చేశారు.అమితాబ్ బచ్చన్ వయస్సు ప్రస్తుతం 81 సంవత్సరాలు అనే సంగతి తెలిసీందే.8 పదుల వయస్సులో విజిల్స్ వేయించే నటన అమితాబ్ కు మాత్రమే సాధ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Interesting And Amazing Facts About Amitabch Bachchan Details Inside Goes Vira-TeluguStop.com

అమితాబ్ నటనను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.సినిమా ఏదైనా పాత్ర ఏదైనా అమితాబ్ ( Amitabh )మాత్రం తన నటనతో అంచనాలను మించి మెప్పిస్తున్నారనే చెప్పాలి.

ఏ సినిమా అయినా అంచనాలను మించి మెప్పిస్తూ ప్రశంసలు అందుకోవడం ద్వారా ఎన్నో మెట్లు పైకి ఎక్కుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Crore Range, Amitabh, Kalki, Prabhas-Movie

వయస్సు పెరుగుతున్నా అమితాబ్ బచ్చన్ లో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ ( Remuneratio n )తీసుకున్నారని తెలుస్తోంది.ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో అమితాబ్ బచ్చన్ రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.

అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కాకుండా ఎవరు నటించినా సినిమా ఈ స్థాయిలో హిట్ అయ్యేది కాదని చెప్పవచ్చు.

Telugu Crore Range, Amitabh, Kalki, Prabhas-Movie

పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా అందరూ మెచ్చేలా అమితాబ్ నటన ఉందని చెపవచ్చు.కల్కి 2898 ఏడీ సంచలనాలు మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.కల్కి సినిమా సక్సెస్ తో ప్రభాస్ సైతం ఎంతో సంతోషిస్తున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ సినిమాలు బిజినెస్ పరంగా అదరగొడుతున్నాయనే సంగతి తెలిసిందే.అమితాబ్ మరిన్ని తెలుగు సినిమాలలో నటించి భారీ విజయాలను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube