తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తనయుడిగా రామ్ చరణ్ కి మంచి గుర్తింపైతే ఉంది.ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్పగా నిలబెడుతున్నాయి.
ఇప్పటికే పాన్ ఇండియాలో ఆయన చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి.ఇక ఇప్పుడు ఆయన గేమ్ చేంజర్ సినిమాతో ( game changer movie )మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ కోసం దాదాపు 15 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది.

ఒక్క క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరించడానికి అన్ని కోట్లు ఎందుకు పెట్టారు అంటూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న సినీ మేధావుల నుంచి భారీ కథనాలైతే వెలువడుతున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా తన మార్కు ను చూపిస్తూ ఈ సినిమాలో ఆ ఫైట్ ని తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది.ఇక క్లైమాక్స్ ఫైట్ చూసి బయటికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కాలర్ ఎగేరేసుకొని వచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని ఈ సినిమా యూనిట్ నుంచి సమాచారం అయితే అందుతుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో రామ్ చరణ్ ఉంటే శంకర్ మాత్రం మరోసారి తనకంటూ సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాల వల్ల ఇద్దరికీ యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక వీళ్లిద్దరూ కలిసి సూపర్ సక్సెస్ సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.