ఈ మధ్య కాలంలో కిడ్నీ(మూత్రపిండాలు) వ్యాధులతో బాధ పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ స్టోన్స్, క్రానిక్ కిడ్నీ ఇలా రకరకాల వ్యాధులకు గురవుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, మద్యపానం, ధూమపానం, ధీర్ఘకాలిక వ్యాధులు, డీహైడ్రేషన్, పలు రకాల మందుల వాడకం వంటి కారణాల వల్ల కిడ్నీ వ్యాధులు వేధిస్తూ ఉంటాయి.అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే గనుక మన కిడ్నీలను మనమే పది కాలాల పాటు వదిలంగా కాపాడుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ జాగ్రత్తలు ఏంటో చూసేయండి.
కిడ్నీల ఆరోగ్యాన్ని పెంచడంలో క్యాప్సికం అద్భుతంగా సమాయపడతాయి.క్యాప్సికం ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే.అందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు కిడ్నీ వ్యాధులు దరి చేరకుండా అడ్డుకట్ట వేస్తాయి.
ఒకవేళ ఉన్నా నయం చేస్తాయి.
పైన చెప్పుకున్నట్టు డీహైడ్రేషన్ కూడా కిడ్నీ వ్యాధులకు ఒక కారణం.
కాబట్టి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.వాటర్‌తో పాటుగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు వంటివి కూడా తీసుకోవాలి.
అలాగే కొందరు మూత్రం వస్తుంటే గంటలు తరబడి ఆపుకుంటారు.కానీ, ఇలా తరచూ చేయడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడి తీవ్రంగా దెబ్బ తింటాయి.కాబట్టి, మూత్రం వచ్చినపుడు వెంటనే వెళ్లాలి.
రంగు రంగుల బెర్రీలు కిడ్నీలకు ఎంతో మేలు చేస్తాయి.
వాటిలో ఉండే ఫైబర్ మరియు ఇతర పోషక విలువలు మూత్రపిండాల వ్యాధులను నివారించి.వాటిని పని తీరును మెరుగు పరుస్తాయి.
సో.బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీ, రాస్బెరీ, బ్లాక్ బెర్రీ వంటివి డైట్‌లో ఉండేలా చూసుకోండి.
వెల్లిల్లు, అల్లం, ఉల్లి వంటివి కూడా కిడ్రీల ఆరోగ్యానికి పెంచగలవు.వీటిని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది.అదేవిధంగా, ప్రతి రోజు వ్యాయామాలు, యోగా వంటివి చేస్తుండాలి.మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలి.