పుష్ప ది రైజ్ మూవీ( pushpa the rule movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన పుష్ప ది రూల్ మూవీ అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంది.
పుష్ప ది రూల్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏకంగా 507 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి.బాలీవుడ్ లో వేగంగా 500 కోట్ల రూపాయల కలెక్షన్లను అందుకున్న సినిమాగా పుష్ప ది రూల్ నిలిచింది.
ఈ రికార్డ్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదు.అయితే బన్నీ సినిమా మాత్రం సులువుగానే ఈ ఘనతను సొంతం చేసుకుందని చెప్పాలి.బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమాకు సొంతమైన రికార్డుల విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు.
బన్నీ రెమ్యునరేషన్ ప్రస్తుతం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

బన్నీ ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉండగా రాబోయే రోజుల్లో మరికొన్ని రికార్డులు చేరే అవకాశాలు అయితే ఉన్నాయి.అల్లు అర్జున్ విభిన్నమైన కథలను ఎంచుకోవడం ఆయన సక్సెస్ సీక్రెట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్ ( Allu Arjun )ఇకపై వేగంగా సినిమాలలో నటించనున్నారని సమాచారం అందుతోంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బన్నీ రేంజ్ ను పెంచుతున్నాయి.

అల్లు అర్జున్ పుష్ప2 సినిమా వల్ల ఎన్నో వివాదాలలో చిక్కుకున్నారు.ఈ వివాదాల వల్ల భవిష్యత్తులో పెద్ద సినిమాలకు కొన్ని ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈవెంట్లకు హాజరు కావడానికి సెలబ్రిటీలు సైతం భయపడే పరిస్థితి నెలకొందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బన్నీ పుష్ప ది రూల్ కలెక్షన్ల విషయంలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.