చద్ది అన్నం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

ఉదయాన్నే లేచి మొఖం కడుక్కుని.ఉన్న తరువాత తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

 There Are Many Benefits To Eating Chaddi Rice, Potassium, Calcium, Iron, Vitamin-TeluguStop.com

టిఫిన్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఇడ్లి ,దోస ,చపాతి.వీటినే మనం తింటాం.

పల్లెటూరి వాతావరణం లో పెరిగిన వాళ్ళు గానీ,పల్లె ప్రజలు కానీ తప్పనిసరిగా ఉదయం చద్ది అన్నం తింటారు.రాత్రి వండిన అన్నాన్ని తెల్లారి ఆవకాయ.

పెరుగు కలుపుకుని పచ్చిమిరప.ఉల్లిగడ్డ నంజుకుని ఒకప్పుడు తినేవారు.

దీనికి రీజన్ లేకపోలేదు.చద్ది అన్నం లో పోషకాలు ఎక్కువగా ఉంటాయట.

ఇలా తింటే రోజంతా ఉత్తేజంగా ,శక్తివంతంగా ఉంటారు అని చెప్తున్నారు.

చద్ది అన్నంలో పొటాషియం ,కాల్షియం ,ఐరన్,విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయట.

ఉల్లిపాయని ,మిరపకాయని పేరుగు ని కలిపి చద్ది అన్నంతో కలిపి తింటే.శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది.

శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.హైపర్ టెన్షన్ ని కూడా తగ్గిస్తుంది.

శరీరం ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది.

అంతేకాదు.

రాత్రిపూట మిగిలిన అన్నంలో కొంచం పాలు ,పచ్చి ఉల్లిపాయి ముక్కలు ,అల్లం,కరివేపాటు , జీలకర్ర వేసి కలిపి దానిలో కొంచం పెరుగు వేసి పొద్దున్నే తింటే …కడుపులో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి.ఎముకలకి మంచి బలాన్ని కూడా ఇస్తుంది.

చద్దన్నం తింటే మంచిదే కదా అని తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలా ఉంచేస్తే ,పాడయ్యిపోతుంది.అందుకే చద్ది అన్నాన్ని ఉదయం పూట వెంటనే తినేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube