పొడి చర్మంతో చింతేలా.. ఈ సింపుల్ చిట్కాలతో రిపేర్ చేసేయండి!

ప్రస్తుత చలికాలంలో( winter ) చర్మం ఎంతలా పొడి బారిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా ముఖ చర్మం డ్రై గా మారి కళ తప్పి కనిపిస్తుంటుంది.

 Repair Your Skin With These Simple Remedies! Simple Remedies, Skin Care, Skin Ca-TeluguStop.com

అటువంటి చర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక తెగ చింతిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను తప్పకుండా ప్రయత్నించండి.

Telugu Tips, Dry Skin, Skin, Latest, Repairskin, Skin Care, Skin Care Tips, Smoo

రెమెడీ 1: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు కీర దోసకాయ స్లైసెస్, పది ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint leaves ) వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ ను మూడు టేబుల్ స్పూన్లు చొప్పున ఒక బౌల్ లోకి తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నీరు తొలగించిన పెరుగు( curd ), వన్ టేబుల్ టీ స్పూన్ తేనె ( Honey )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

ఆపై పది నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు తడి క్లాత్ సాయంతో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తే డ్రై స్కిన్ అన్నమాట అనరు.

ఈ రెమెడీ చర్మాన్ని హైడ్రేట్ గా మరియు స్మూత్ గా మారుస్తుంది.చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉన్నా కూడా వాటిని తొలగిస్తుంది.

Telugu Tips, Dry Skin, Skin, Latest, Repairskin, Skin Care, Skin Care Tips, Smoo

రెమెడీ 2: పొడి చర్మాన్ని నివారించడానికి పాల మీగడ కూడా ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.వన్ టేబుల్ స్పూన్ పాల మీగడ ని తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఆపై పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు తడి క్లాత్ సాయంతో క్లీన్ చేసుకోవాలి.

మీరు ఈ రెమెడీని రెగ్యులర్ గా పాటించవచ్చు.ఇది డ్రై స్కిన్ ను రిపేర్ చేస్తుంది.చర్మాన్ని తేమ గా, మృదువుగా మారుస్తుంది.సాగిన చర్మాన్ని టైట్ చేస్తుంది.

స్కిన్ ఏజింగ్ ను సైతం ఆలస్యం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube