మెరీనా స్మిత్ ( Marina Smith )అనే 34 ఏళ్ల మోడల్‌కు ఒక వింత అనుభవం ఎదురయ్యింది. బ్రెజిల్( Brazil ) లోని సావో పాలోకు చెందిన ఈ ముద్దుగుమ్మ ఒకప్పటి మిస్ బంబమ్ విజేత కూడా.
అయితే ఇప్పుడు తన స్నేహితులు తనని క్రిస్మస్ విందుకు పిలవలేదని ఆమె వాపోతుంది.ఎందుకంటే, ఆమె అందం వల్ల తమ భర్తలు, బాయ్ ఫ్రెండ్స్ ఆమె వైపు ఆకర్షితులవుతారని ఆ స్నేహితురాళ్లు భయపడ్డారట.“నేను వాళ్ల మగవాళ్ళను దొంగిలిస్తానని వాళ్ళు అనుకుంటున్నారు” అని మరినా ఒక వార్తా సంస్థతో చెప్పింది.వాళ్ల అభద్రతా భావమే ఈ పరిస్థితికి కారణమని ఆమె నొక్కి చెప్పింది.
మెరీనా ఎప్పుడూ తన స్నేహితుల భాగస్వాములతో సరససల్లాపాలు ఆడలేదని లేదా వారిపై ఆసక్తి చూపలేదని చెబుతోంది.తాను తన ఆత్మవిశ్వాసం కోసమే డ్రెస్ చేసుకుంటానని, ఎవరి దృష్టిని ఆకర్షించడానికి కాదని ఆమె వివరించింది.“సమస్య నాలో లేదు,” అని ఆమె తేల్చి చెప్పింది.వాళ్ళ అభద్రతా భావం వలన ఒక నమ్మకమైన, మద్దతు ఇచ్చే స్నేహితురాలిని వాళ్ళు కోల్పోయారని మరినా బాధపడుతుంది.
ఇలా అందంగా ఉన్నందుకు ఆడవాళ్ళని దూరం పెట్టడం కొత్తేమీ కాదు.సబ్రినా ( Sabrina )అనే 23 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది.తనని పెళ్లి కూతురు స్నేహితుల గుంపులో చేర్చుకోలేదు.
పెళ్లి కూతురు స్వయంగా చెప్పిన కారణం ఏమిటంటే, సబ్రినా సన్నగా, నాజూగ్గా ఉండడం వల్ల పెళ్ళిలో అందరి కళ్ళు తన మీదే ఉంటాయని భయపడిందట.ఇంకో సంఘటనలో, ఫ్లోరిడాకు చెందిన 29 ఏళ్ల షై లీ, తనని కేవలం చూడగానే అంచనా వేస్తారని, దానివల్ల తన స్నేహాలు, సామాజిక సంబంధాలు దెబ్బతింటున్నాయని చెప్పింది.
మెరీనా స్మిత్ విషయానికి వస్తే, ఆమె ఆల్రెడీ సింగిల్.ఇక తన స్నేహితులు వాళ్ళ భాగస్వాములతో గడుపుతూ ఈమెను దూరం పెడుతున్నారు కాబట్టి తను మరింత ఒంటరినని భావిస్తుంది.అలాంటిది ఇప్పుడు, అందంగా ఉండడమే వాళ్ళకు సమస్యగా మారిందని ఆమె అంటోంది.
స్టైలిష్ దుస్తులు వేసుకున్నా, తన ఉద్దేశం ఎప్పుడూ ఎవరినీ రెచ్చగొట్టడం లేదా పోటీ పడడం కాదని మరినా గట్టిగా చెబుతోంది.ఈ సంఘటనలు స్నేహాలపై అభద్రతా భావాల ప్రభావాన్ని, అందమైన ఆడవారు ఎదుర్కొనే సవాళ్ళను తెలియజేస్తున్నాయి.