టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ ( Hero Ram Charan )ఆయన భార్య ఉపాసన ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
మరోవైపు ఉపాసన మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే అపోలో హాస్పిటల్ ( Apollo Hospital )చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అలాగే అప్పుడప్పుడు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటూ ఉంటుంది ఉపాసన.
ఇక రామ్ చరణ్ హీరోగా, నిర్మాతగా,బిజినెస్ మాన్ గా నాలుగు చేతులా సంపాదిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు దాదాపు 100 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ బాగానే సంపాదిస్తున్నాడు చెర్రీ.
మరోవైపు చరణ్ సొంతంగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ ( Konidela Productions Company )స్థాపించి సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.అలాగే క్రీడారంగంలోను అతడు తెలివిగా పెట్టుబడులు పెడుతున్నాడు.విమానయాన రంగం ట్రూజెట్‌లో ఒక భాగస్వామిగా చరణ్ ఉన్నారు.గణాంకాల ప్రకారం.రామ్ చరణ్ నికర ఆస్తి విలువ సుమారు 1370 కోట్లు ఉంటుందని గతంలో ఫోర్బ్స్ సైతం కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.తన భార్య ఉపాసన ఆస్తులతో సంబంధం లేకుండా కేవలం చరణ్ ఆస్తి విలువ మాత్రమే ఇంత ఉంది.
మరి కేవలం చరణ్ ఆస్తులు విలువ మాత్రమే అన్ని కోట్లు ఉంటే మరి ఉపాసన ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఇద్దరి ఆస్తులు కలిపితే ఎంత ఉంటాయి అన్న విషయాల గురించి ఆలోచిస్తున్నారు అభిమానులు.
ఉపాసన అపోలో సంస్థల్లో మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పని చేస్తున్నారు.అపోలో హెల్త్ మ్యాగజైన్ నిర్వాహకురాలు.అపోలో లైఫ్ వెల్‌నెస్ చైన్ మొత్తం చూసుకునేది ఉపాసన.
తద్వారా ఉపాసనకు దక్కే వాటా ప్రకారం తన నికర ఆస్తుల విలువ సుమారు 1100 కోట్లు ఉంటుందని సమాచారం.చరణ్, ఉపాసన ఇద్దరి ఆస్తులను కలుపుకుంటే సుమారు 2500 కోట్ల నికర విలువ ఈ జంటకు ఉంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చే వారసత్వపు ఆస్తులతో సంబంధం లేకుండానే, రామ్ చరణ్ తనకు తానుగానే ఎదుగుతున్నారు.ఒక స్టార్ గా రాణిస్తూనే, వ్యాపారాలను చక్కబెట్టుకోవడంలో అతడు సవ్యసాచిలా పని చేస్తున్నాడు.
అందువల్లనే ఈ ఆస్తుల విలువ అంతకంతకు పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు.కేవలం ఈ ఆస్తులు మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో ఉంటే ఇక తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఆస్తులు కలుపుకుంటే అంతకు రెండింతలు అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.