పొట్ట కొవ్వును నెల రోజుల్లో మాయం చేసే పవర్ ఫుల్ టీ మీకోసం!

సాధారణంగా కొందరికి శరీరం మొత్తం సన్నగా ఉన్న పొట్ట వద్ద మాత్రం లావుగా ఉంటుంది.ప్రెగ్నెన్సీ, గంటలు తరబడి కూర్చుని ఉండటం, మద్యపానం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వ‌ల్ల‌ పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోతుంటుంది.

 A Powerful Tea That Burns Belly Fat In A Month Is For You! Powerful Tea, Belly F-TeluguStop.com

దాంతో నాజూగ్గా ఉండాల్సిన పొట్ట లావుగా తయారవుతుంది.దీంతో పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ టీని డైట్ లో చేర్చుకుంటే పొట్ట కొవ్వు నెల రోజుల్లోనే మాయం అవుతుంది.ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా అంగుళం పచ్చి పసుపు కొమ్మును తీసుకుని పీల్‌ తొలగించి సన్నగా తురుముకోవాలి.

Telugu Belly Fat, Fat Tea, Fat Cutter Tea, Tips, Latest, Powerful Tea, Turmeric

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్‌ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే పసుపు కొమ్ము తురుమును వేసి క‌నీసం ప‌ది నిమిషాల‌ పాటు మరిగించాలి.తద్వారా టర్మరిక్ టీ సిద్ధమవుతుంది.

టర్మరిక్ టీని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ టర్మరిక్ టీని నేరుగా కాకుండా వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసి సేవించాలి.

అప్పుడే మంచి రిజల్ట్ లభిస్తుంది.ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ టర్మరిక్ టీ తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.

బాన పొట్ట నెల రోజుల్లో నాజూగ్గా మారుతుంది.అంతేకాదు ఈ టర్మరిక్‌ టీను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.

ఇమ్యూనిటీ సిస్టం స్ట్రాంగ్ గా మారుతుంది.జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు దూరమవుతాయి.

డిప్రెషన్ వంటి మానసిక సమస్య నుంచి బయటపడేందుకు సైతం ఈ టర్మరిక్ టీ ఎంతగానో సహాయపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube