బాన పొట్టతో బాధపడుతున్నారా? బెల్లీ ఫ్యాట్ కారణంగా శరీర ఆకృతి దారుణంగా మారిందా? పెరిగిన పొట్టను తగ్గించుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నారా? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే కేవలం ఇరవై రోజుల్లోనే పొట్ట కొవ్వు మాయం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కప్పు పైనాపిల్ ముక్కలను( pineapple ) కట్ చేసి పెట్టుకోవాలి.అలాగే రెండు స్ట్రాబెర్రీ పండ్లు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు( Strawberry slices ) వేసుకోవాలి.
అలాగే మూడు నుంచి నాలుగు ఫ్రెష్ పాలకూర ఆకులు వేసి ఒక గ్లాసు హోమ్ మేడ్ బాదం పాలు పోసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న స్మూతీలో రెండు టేబుల్ స్పూన్లు తేనె( honey )ను కలిపి తీసుకోవడమే.ఈ పైనాపిల్ స్ట్రాబెర్రీ పాలక్ స్మూతీ టేస్ట్ గా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా పొట్ట కొవ్వును కరిగించడానికి ఈ స్మూతీ చాలా బాగా సహాయపడుతుంది.
రెగ్యులర్ డైట్ లో ఈ స్మూతీని చేర్చుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.
అంతేకాదు ఈ స్మూతీని తీసుకోవడం వల్ల రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.నీరసం అలసట వంటివి సైతం దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.కాబట్టి, ఈ హెల్తీ అండ్ ఫ్యాట్ బర్నింగ్ స్మూతీని తప్పకుండా డైట్ లో చేర్చుకోండి.