తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ రాశారు.అడవుల పెంపకానికి విడుదల చేస్తున్న కంపా నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని లేఖలో విన్నవించారు.
రూ.610 కోట్ల నిధులను వినియోగించుకోకపోవడంపై కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రభుత్వం అడవుల విస్తీర్ణం లక్ష్యాన్ని చేరుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.







