1.రేవంత్ రెడ్డి పై జగ్గా రెడ్డి కామెంట్స్

తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.తెలంగాణ సీఎం కేసీఆర్ తో తనకు విభేదాలు లేవని, తన పంచాయతీ అంతా రేవంత్ రెడ్డి తోనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2.బోధన్ లో 144 సెక్షన్

నిజామాబాద్ జిల్లా బోధన్ లో 144 సెక్షన్ కొనసాగుతోంది.అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
3.ఎం సి హెచ్ ఆర్ డి లో మంత్రుల సమీక్ష
ఎం సి హెచ్ ఆర్ డి లో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు.మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వాడ అజయ్ పాల్గొన్నారు.
4.టెన్త్ పరీక్షలు ఏప్రిల్ లోనే నిర్వహించాలి

వేసవి ఎండల ను దృష్టిలో పెట్టుకుని టెన్త్ పరీక్షలను ఏప్రిల్ నెలలోనే నిర్వహించాలని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం ( ట్రస్మా ) ప్రభుత్వాన్ని కోరుతోంది
5.యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లో మహా కుంభ సంప్రోక్షణ పూజలు ప్రారంభమయ్యాయి.
6.నేడు మాణిక్యం ఠాకూర్ తో రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఠాకూర్, కేసీ వేణుగోపాల్ తో భేటీ అవుతారు.
7.జగన్ పై తులసి రెడ్డి కామెంట్స్
మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ కు దిన చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు.
8.బన్నీ వాసు పై ఆరోపణలు
ప్రముఖ నిర్మాత బన్నీవాసు తనను నమ్మించి మోసం చేశాడని బోయ సునీత అనే జనసేన వీర మహిళ ఆరోపిస్తూ పార్టీ కార్యాలయం దగ్గరలో ఆందోళన నిర్వహించారు.
9.జగన్ కు ఉక్రెయిన్ విద్యార్థుల ధన్యవాదాలు

ఏపీ సీఎం జగన్ ను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన తెలుగు విద్యార్థులు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
10.నలుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం నాటుసారా వ్యవహారంపై దద్దరిల్లింది ఈ సందర్భంగా సభ నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించిన నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.
11.మండలి చైర్మన్ కు టిడిపి సభ్యుల లేఖ
ఏపీ శాసన మండలి చైర్మన్ కు టిడిపి సభ్యులు లేఖ రాశారు.ఏపీలో హానికరమైన ప్రాణాంతకమైన మద్యాన్ని అమ్ముతున్నారని లేఖల లో ప్రస్తావించారు.
12.బాలకృష్ణ పీఏ అరెస్ట్

వైసీపీ నేతలకు చెందిన బార్ లో పేకాట ఆడుతూ, దొరికిన హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఏ బాలాజీ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
13.లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి శాసనసభా పక్షం నిరసన

ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి శాసన పక్షం నిరసన కార్యక్రమం చేపట్టింది రాష్ట్రంలో కల్తీ సరా బ్రాండ్ మద్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ సందర్భంగా వారు విమర్శించారు.
14.కడపలో అన్న క్యాంటీన్ భవనం కూల్చివేత
కడప అన్న క్యాంటీన్ భవనాన్ని కడప కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు.
15.సోము వీర్రాజు కు సిపిఐ రామకృష్ణ సవాల్

బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ సవాల్ విసిరారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ రామకృష్ణ ప్రశ్నించారు.
16.లోక్ సభ సభ్యత్వానికి అఖిలేష్ యాదవ్ రాజీనామా
ఉత్తరప్రదేశ్ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఈరోజు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించారు.
17.వీధి విక్రయదారులను ఆదుకోవాలి : జె.డి

రాష్ట్రంలో వీధి విక్రయదారుల బతుకుతెరువు , రక్షణ, క్రమబద్దీకరణ చట్టాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
18.జగన్ పై పోసాని కామెంట్స్

ఏపీ సీఎం జగన్ మామూలోడు కాదని, దేవుడి ప్రసాదం వంటి వాడని ప్రముఖ నటుడు , వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి ప్రశంసలు కురిపించారు.
19.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,750 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,100
.