సినిమా ఇండస్ట్రీలో శాశ్వతంగా స్థానం సంపాదించుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు.కొందరికి అదృష్టం వరించిన మరి కొంతమందికి అది కూడా దొరక్క పోవచ్చు.
అలా అదృష్టమో దురదృష్టమో కానీ సినిమా ఇండస్ట్రీలో తమకు తెలియకుండానే కొన్ని కొన్ని సార్లు దిగ్గజ స్థానంలో ఉన్న కొంతమందిని పరిచయం చేసే అవకాశం కూడా దక్కుతుంది.ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఉన్న వారు నాడు ఎవరో ఒకరు అవకాశం ఇస్తేనే కదా ఈ స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం దిల్ రాజు మాత్రమే.
కానీ దిల్ రాజు సైతం కెరియర్ తొలినాలలో ఇబ్బందులు పడ్డాడు ఈరోజు లక్కీ రాజు లేదా నైజాం రాజు అని పిలవబడుతున్న దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి.
మూడు డబ్బింగ్ సినిమాలు తీసి అవి కూడా ఫ్లాప్ కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రోజుల్లో ఆయనకు చేయూత ఇచ్చింది మరెవరో కాదు కాస్ట్యూమ్ కృష్ణ.ఇక నటుడు మరియు విలన్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన కాస్ట్యూమ్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
భారత్ బంద్ లాంటి సినిమాతో తొలిసారి నటించడం మొదలుపెట్టిన కృష్ణ ఆ తర్వాత నిర్మాతగా కూడా మారాడు.
అలా నిర్మాతగా మారి తాను తీసిన సినిమా జగపతిబాబు, రాశి హీరో హీరోయిన్స్ గా నటించిన పెళ్లి పందిరి.ఫ్లాప్స్ లో ఉన్న ఆ దిల్ రాజులు పిలిచి కేవలం 60 లక్షలకే ఈ సినిమాకి సంబంధించిన నైజం రైట్స్ ఇవ్వడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది.దాంతో కెరియర్ లో వెలు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు దిల్ రాజుకి.
ఈ సినిమా సమయంలో కాస్టింగ్ కృష్ణ తెల్ల పేపర్ల పై సంతకాలు పెట్టి వేరే వ్యక్తికి డబ్బులు ఇవ్వడంతో అతడు మోసం చేశాడు.దాంతో కాస్ట్యూమ్ కృష్ణ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా కనుమరుగైపోయాడు ఆ తర్వాత ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలను తెలుగులో రీమేక్ చేసిన అది కూడా వర్క్ అవ్వలేదు.
అలా దిల్ రాజు లాంటి ఒక గొప్ప డిస్ట్రిబ్యూటర్ కి నిర్మాతగా అయ్యే అవకాశం అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఒక స్థానం ఇచ్చింది కాస్ట్యూమ్ కృష్ణ అనే విషయం చాలామందికి తెలియదు.