చపాతి - రైస్.. ఏది తింటే మంచిది?

మన ఇంట్లో కూడా వస్తూ ఉండే చర్చే ఇది.వండిన బియ్యాన్ని తినాలా లేక చపాతి/రొట్టె తినాలా అని? రెండిట్లో ఏది బెటర్ అనే టాపిక్ మీద గంటలకొద్దీ చర్చలు పెట్టుకునేవారిని కూడా చూసే ఉంటాం.మరి న్యూట్రిషన్ నిపుణులు ప్రకారం చపాతి – రైస్ లో ఏది బెటర్? ఏం తినాలి?

 Rice Or Chapathi What To Prefer In Your Diet Details, Rice, Chapathi, Nutients,-TeluguStop.com

నిజానికి ఇప్పుడు మనం తింటున్న రైస్ పూర్తిగా న్యూట్రింట్స్ ని కలిగి ఉండదు.కారణం తెలుసుగా, పాలిష్డ్ రైస్ మనం తినేది.

తెల్లగా ఉండేట్లు పాలిష్ చేయడం వలన ఫైబర్, ఐరన్, కాల్షియం, బీ కాంప్లెక్స్ విటమిన్స్ ని కోల్పోతుంది రైస్.అంటే, మనకు అందేది స్వచ్ఛమైన బియ్యం కాదు అన్నామాట.

చాలామందికి తెలియని విషయం, ఇప్పుడు మనం తినే బియ్యంలో కార్బోహైడ్రేట్‌లు కూడా తక్కువే.అందుకే, మనం ఎక్కువ కాలరీలు తీసుకుంటాం.

అందుకే మిగితావాటితో పోల్చుకుంటే వండిన బియ్యం ఎక్కువ తింటాం అన్నమాట.

ఇక కల్తీ లేని గోధుమ అలా కాదు.

ఫైబర్, ప్రోటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, ఐరన్, కాల్షియం, సెలెనియం, పొటాషియం, మెగ్నీషియం.అన్ని బాగా దొరుకుతాయి.

కార్బోహైడ్రేట్‌లు బాగా ఉండటంతో ఎక్కువ కాలరీలకు పోకుండా, ఓ లిమిట్ లో తినవచ్చు.

Telugu Brown, Carbohydrates, Chapathi, Polished, Proteins, Vitamins-General-Telu

అయితే, రైస్ తో పోల్చుకుంటే చపాతీలో తక్కువ కాలరీలు లభిస్తాయి అని కాదు, కాలరీల ఇంటేక్ మాత్రం తగ్గుతుంది.ఇది లాభదాయకం.

కాబట్టి, స్వచ్ఛమైన బ్రౌన్ రైస్ లభిస్తే, మొహమాటం లేకుండా తినండి.

ఇక వైట్ రైస్, చపాతీలలో ఏది తినాలో మీకే వదిలేస్తున్నాం కాని, చపాతీ మాత్రం వైట్ రైస్ కన్నా బెటర్ అప్షన్ లెక్కలోకే వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube