యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.దీంతో అఖిల్ ఆనందంగా ఉన్నాడు.
ఈ సినిమా తర్వాత అఖిల్ ప్రెసెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో భారీ యాక్షన్ చేజింగ్ సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.దీంతో ఈ సినిమా కూడా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.
ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పథకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు హిప్ హిప్ తమిజా సంగీతం అందిస్తుండగా సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుంది.ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.ఇక సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం అఖిల్ లుక్ ను స్టైలిష్ గా మార్చిన విషయం తెలిసిందే.
ఈ రోజు అక్కినేని అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఏజెంట్ సినిమా నుండి మేకర్స్ ఒక ప్రత్యేక మైన పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ పోస్టర్ లో అఖిల్ బెస్ట్ మోడల్ లో సిగరెట్ తాగుతూ తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నాడు.
ఈ పోస్టర్ తో మరోసారి బ్లాస్టింగ్ లుక్ ను రివీల్ చేసారు మేకర్స్.”వైల్డ్ వన్ వైల్డ్ హంట్.అఖిల్ అక్కినేని బర్త్ డే బ్లాస్ట్ పోస్టర్.
హ్యాపీ బర్త్ డే” అంటూ అఖిల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్.ఈ లుక్ అందరిని ఆకట్టు కుంటుంది.
ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఈ పోస్టర్ ఆకట్టు కుంటుంది.మరి అఖిల్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మాస్ ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు తెచుకుంటాడో లేదో చూడాలి.